Gruhalakshmi December 1st: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్
అనసూయ తన తప్పు తెలుసుకోవడంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అనసూయ తన బాధ అంతా ఇంట్లో అందరితో పంచుకుంటుంది. తులసి దాని గురించి మాట్లాడొద్దు అని అంటుంది. తన కోసం ఇంటికి వస్తూ పోతూ ఉండమని అనసూయ తులసిని అడుగుతుంది. రోజంతా ఉండాలని అడగను ఒక గంట ఉన్నా చాలు అని బతిమలాడుతుంది. లాస్యని బయటకి వెళ్లిపొమ్మని అన్నందుకు కోపంతో గించుకుంటుంది. లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని కోపంతో రగలిపోతూ ఉంటుంది. ఆ ముసలాయనకి ఆస్తి కలిసొచ్చినట్టు ఈవిడకి కూడా ఆస్తి ఏమైనా వచ్చిందా నాకు తెలియకుండా ఆ తులసికి వాటా ఇవ్వాలని చూస్తున్నారా ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుంది.
తులసిని ఇంటికి రమ్మని అనసూయ అడిగితే రావడం కుదరదని సున్నితంగా చెప్తుంది. ఆ మాటకి దివ్య చాలా బాధపడుతుంది. కావాలంటే మీరందరూ అక్కడికి రావొచ్చు. కానీ నేను ఈ ఇంటికి రాలేను. ఈ ఇల్లు ఎవరిదో వాళ్ళకి నేను ఈ ఇంటికి రావడం ఇష్టం లేదని చెప్తుంది. ఈ ఇల్లు నీది కాదు కానీ ఇంట్లో వాళ్ళు నీవాళ్ళు కదా నువ్వు వస్తే ఈ ముసలి ప్రాణాలు ఆనందపడతాయి అని అనసూయ చాలా బాధగా అడుగుతుంది. లోపలికి రావడం ఇబ్బంది అయితే బయట నుంచి కనిపించి వెళ్లిపో, 26 ఏళ్లుగా నీ మొహం చూస్తూ నిద్ర లేవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు నువ్వు లేకుండా ఉండటం శిక్షలాగా ఉందని బతిమలాడుతుంది. మీకోసం ఇంటికి వస్తూ పోతూ ఉంటానని తులసి చెప్పేసరికి ఇంట్లో అందరూ సంతోషిస్తారు.
Also Read: సామ్రాట్ ని దొంగలాగా పరుగులు పెట్టించిన తులసి- క్షమించమని కన్నీటితో వేడుకున్న అనసూయ
అనసూయ ఏడుస్తుంటే తనని నవ్వించడానికి ప్రేమ్, దివ్య అందరూ తెగ ఓవరాక్షన్ చేస్తారు. తులసి బయటకి వెళ్తుండగా అక్కడ దేవుడి ముందు దీపం కొండెక్కడం చూసి అది ఆరిపోకుండా చేస్తుంది. అది చూసి లాస్య కడుపు మండిపోతుంది.
లాస్య: వచ్చిన దానివి వెళ్లిపోకుండా నా ఇంట్లో మా దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తున్నావ్
తులసి: మీ దేవుడు మా దేవుడు అని సపరేట్ గా ఉండరు. నువ్వు నా ఇంట్లోకి అడుగుపెట్టి నా కాపురంలో నిప్పులు పోశావ్. ఇంటి కోడలివి అయి ఉండి దీపం కొండెక్కుతుంటే చూడకుండా ఉన్నావ్. అయినా నీకు కాపురాలు, దీపాలు ఆర్పడం తప్ప ఇంకేం తెలుసులే
లాస్య: నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి పరాయి దానివే. పబ్లిక్ పార్క్ కి వచ్చినట్టు వస్తూ పోతూ ఉండటానికి వీల్లేదు. ఇంట్లోకి రావాలంటే నా పర్మిషన్ ఉండాలి. నువ్వు ఇంకొక సారి ఈ ఇంటికి వచ్చావంటే బయట బోర్డు పెడతాను కుక్కలకి, తులసికి ఈ ఇంట్లోని అనుమతి లేదని
తులసి: బోర్డ్ అవసరం ఏంటో కుక్కలకి చదువు రాదు కదా ఇక బోర్డుకి ఖర్చు ఎందుకు చెప్పు
లాస్య: జంతువులతో పోల్చిన కూడా నీకు సిగ్గుగా లేదా
తులసి: నన్ను మూగజీవాలతో పోల్చినందుకు సిగ్గుపడను నీతో పోలిస్తే మాత్రం సిగ్గుపడతాను. తప్పు తెలుసుకుని అత్తయ్య మారుతుంది, నువ్వు కూడా మారు. ఇంట్లో వాళ్ళతో బంధాలు కలుపుకో
ఇద్దరి మధ్య వాడి వేడిగా మాటల యుద్ధం జరుగుతుంది. లాస్యకి తులసి బాగా గడ్డి పెట్టి వెళ్ళిపోతుంది.
Also Read: యష్ మీద తనకున్న ప్రేమ బయటపెట్టిన వేద- కొడుకు మీద కోపంతో ఊగిపోతున్న మాలిని
తరువాయి భాగంలో..
గృహిణి బాధ్యతలు మోయడం అంత సులభం ఏమీ కాదని తులసి సామ్రాట్ తో అంటుంది. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నట్టు మగాళ్లు గృహిణి బాధ్యతలు ఎందుకు చెయ్యలేరు అని తులసితో ఛాలెంజ్ విసురుతాడు. ఒక్కరోజు సీఎంలాగా ఒక్కరోజు గృహిణి బాధ్యతలు మోస్తాను అని అంటాడు. దాని కోసం తెగ తిప్పలు పడతాడు.