Ennenno Janmalabandham August 8th Update: యష్, వేద కర్టన్ లో రొమాన్స్ - ఖైలాష్ ని విడిపించేందుకు అభిమన్యు తిప్పలు
వేద, యష్ ఏకాంతంగా గడిపేలా చెయ్యాలని ఖుషి వసంత్ తో కలిసి ప్లాన్ చేసి వాళ్ళిద్దరూ మాత్రమే ఇంట్లో ఉండేలా చేస్తుంది. వాళ్ళిద్దరి ఏకాంతానికి మధ్యలో ఓ దొంగోడు వస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్ కాసేపు దొంగతో ముచ్చటి పెడతాడు. పెళ్ళాం కోసమే దొంగగా మారానని అంటాడు ఆ దొంగోడు. అతడికి యష్ కొంత డబ్బు ఇవ్వడంతో వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ మీకోక మాట చెప్పనా సార్ మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉన్నారని చెప్పి వెళ్ళిపోతాడు. కాంచన ఖైలాష్ దగ్గరకి వస్తుంది. నా చెల్లెమ్మా బాగుందా అని ఖైలాష్ అడుగుతాడు. మిమ్మల్ని జైల్లో పెట్టించిన వాళ్ళ గురించి కూడా అడుగుతున్నారు ఎంత మంచి వాళ్ళండి మీరు అని కాంచన అంటుంది. మనకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని కాంచన అనేసరికి అంటే మీ తమ్ముడిని నన్ను విడిపించమని బతిమలడావా వద్దని చెప్పాను కదా అని అంటాడు. మిమ్మల్ని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసని అంటుంది.
వేద ఇంట్లో వాళ్ళు ఇంక రాలేదేంటి అని కిటికీ దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ కిటికీ కర్టన్ ఇరుక్కుపోయిందని వేద దాన్ని లాగబోతుంటే అది ఊడిపడుతుందని గమనించిన యష్ వెంటనే వేదని పక్కకి లాగుతాడు. దీంతో కర్టన్ లో ఇరుక్కుని ఇద్దరు కింద పడిపోతారు. ఇద్దరి చూపులు కలిసి కాసేపు రొమాన్స్ నడుస్తుంది. ఇక ఇంటికి మాలిని, రత్నమ్ అందరూ వచ్చేస్తారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. ఏం జరిగిందని అడుగుతారు. దెబ్బలు ఏమి తగల్లేదు కదా అని అందరూ అడుగుతారు. మీరు ఏదో బిజినెస్ పార్టీకి వెళ్లాలనుకున్నారు వెళ్లలేదా అని రత్నం యష్ ని అడుగుతాడు. లాస్ట్ మినిట్ లో అది క్యాన్సిల్ అయ్యింది అందుకే ఇంట్లోనే ఉండిపోయామని చెప్తాడు. మరి బయట లాక్ చేసి ఉంది ఏంటి అని మాలిని అడుగుతుంది. ఇదిగో ఉన్నాడుగా వీడి వల్లే అని వసంత్ ని చూపిస్తాడు. మీరు వెళ్లిపోయారెమో అనుకుని నేను లాక్ చేశాను నాకేం తెలుసు మీరు ఇంట్లోనే ఉన్నారని అని వసంత్ చెప్తాడు.
Also Read: నేను మోనిత సేమ్ టు సేమ్ అంటోన్న శోభ- సౌందర్య ఇంటికి పెళ్ళిపత్రికలతో వచ్చిన స్వప్న
సారీ యష్ మా వల్ల మీరు ఇంట్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారా అని వసంత్ నోటి దూలతో అని మళ్ళీ ఇంట్లో ఇరుక్కుపోయారు అని కవర్ చేస్తాడు. అక్క కొంచెం అన్నా రిలాక్స్ అయ్యిందా అని యష్ అంటే ఇప్పుడిప్పుడే మారుతుందిలే అని రత్నం చెప్తాడు. చూడబోతుంటే వేదతో టైం స్పెండ్ చేయడానికి మన యష్ వసంత్ తో కలిసి అందరినీ బయటకి పంపించినట్టు ఉంది కదా అని రత్నం అనుమానంగా మాలినితో అంటాడు. వేదతో టైం స్పెండ్ చెయ్యడం మన యష్ కి ఇష్టం లేదని మాలిని అంటుంది. ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడా ఇష్టం లేకుండానే కాపురం చేస్తున్నాడా, అసలే ఈ మధ్య ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది కదా అందుకే ఇలా చేశాడని అనిపిస్తుందని అంటాడు. మంచిదే కదా ఇటు నా కొడుకు అటు నా కూతురు ఇద్దరు సంతోషంగా ఉండటమే నాకు కావాలని మాలిని అంటుంది.
ఖైలాష్ ని ఎలాగైనా విడిపించమని అభిమన్యు లాయర్ తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. విడిపించడం చాలా కష్టం కేసు పెట్టిన వాళ్ళు విత్ డ్రా చేసుకోవడం తప్ప వేరే దారి లేదని లాయర్ చెప్తాడు. అది జరగని పని ఎలాగైనా నువ్వే విడిపించాలి అందుకోసం ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదని అభి అంటాడు. అలాగే సర్ ప్రయత్నిస్తానని లాయర్ చెప్తాడు. మాళవిక వచ్చి ఏమైందని అడుగుతుంది. ఆ ఖైలాష్ గాడికి బెయిల్ దొరకడం చాలా కష్టం అని లాయర్ చెప్తున్నట్టు చెప్తాడు. వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావేమో అనిపిస్తుందని మాళవిక అంటుంది. వాడిని అడ్డు పెట్టుకుని మనం యష్ మీద పగ సాధించాలని అభి అంటాడు.
Also Read: విషం తాగబోయిన దేవయాని- సాక్షితో పెళ్ళికి రిషి ఒప్పుకుంటాడా? వామ్మో దేవయాని స్కెచ్ మామూలుగా లేదుగా
యష్ చేతికి గాయం అవుతుంది. దానికి వేద ట్రీట్మెంట్ ఇస్తుంది. మాలిని అప్పుడే యష్ గదికి వచ్చి ఏమైందని అడుగుతుంది. ఇదిగో ఈవిడగారి నిర్వాకమే కర్టన్ లాగడం వల్ల కింద పడి దెబ్బ తగిలిందని చెప్తాడు. మాలినితో వేదని తిట్టిస్తాడు. మందు రాస్తాను రమ్మని మాలిని పిలుస్తుంది. ఎందుకు వేద డాక్టరే కదా తను చూసుకుంటుందిలే అని యష్ అంటాడు.
తరువాయి భాగంలో..
కాంచన ఏడుస్తూ ఇంట్లోకి వస్తుంది. ఎక్కడకి వెళ్లావ్ అని రత్నం అడుగుతాడు. నా భర్త దగ్గరకి ఆయన్ని చూడాలని అనిపించింది వెళ్ళాను అని చెప్తుంది. అక్కా ఖైలాష్ ఏం చేశాడో చూసినా, అతడు ఎటువంటి వాడో ఎన్ని సార్లు చెప్పినా నీకు ఎందుకు అర్థం కావడం లేడని యష్ అంటాడు. నా భర్తతో నేను మాట్లాడటానికి వెళ్తే ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారని కాంచన అంటుంది. నీకు బాధ కలిగించడం మా ఉద్దేశం కాదు నిజానిజాలు మంచి చెడు తెలుసుకోకుండా ఆ ఖైలాష్ ని గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదని యష్ చెప్తాడు.