By: ABP Desam | Updated at : 03 Nov 2021 08:40 PM (IST)
కురుప్ ట్రైలర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చాలా సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. 'ఒకే బంగారం' సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక 'మహానటి' సినిమాతో తెలుగులో కూడా ఆయనకి మంచి స్టార్ డమ్ వచ్చింది. ఈ క్రేజ్ తోనే ఆయన నటించే మలయాళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'కురుప్' నవంబర్ 12న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.
Also Read: విజయ్ సేతుపతిపై దాడి.. ఎగిరి మరీ తన్నాడు..
కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్ వాలంటేడ్ క్రిమినల్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కురుప్, గోపీకృష్ణన్ అనే రెండు డిఫరెంట్ షేడ్స్ లో దుల్కర్ కనిపించారు. కురుప్ ను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసులు.. వారి ఎత్తులకు పైఎత్తులు వేసే సన్నివేశాలతో ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఈ సినిమాని శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. శోభిత దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రజిత్ సుకుమారన్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సుషిన్ శ్యామ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మళయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
#Kurup.. India’s longest missing fugitive!
— Vijay Deverakonda (@TheDeverakonda) November 3, 2021
An eccentric mastermind or an accidental conman? Discover it in cinemas on 12th November!
Sending my best to Kunjikaaa @dulQuer 🤗❤️https://t.co/vYTQZIYWKm#KurupFromNovember12
Also Read: 'దీపావళి పండగ ముందే వచ్చేసింది..' 'లాలాభీమ్లా' ప్రోమోలో పవన్ మాస్ అవతార్..
Also Read: 'మేజర్' మూవీ రిలీజ్ డేట్ చెప్పిన మహేశ్ బాబు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!