అన్వేషించండి

Puri Jagannadh: ‘పుష్ప’ వల్లే ‘లైగర్’కు నత్తి, పూరి సినిమాపై ఆసక్తికర విషయాలు చెప్పిన సుకుమార్

దర్శకుడు పూరి జగన్నాథ్ ను మరో దర్శకుడు సుకుమార్ చేసిన ఇంటర్వ్యూ సినీ అభిమానులు ఎంతో ఆకట్టుకుంటోంది. ఇందులో లైగర్ నత్తికి అసలు కారణం చెప్పారు పూరి.

మాస్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్.. క్లాస్ దర్శకుడి నుంచి పుష్ప సినిమాతో ఊరమాస్ దర్శకుడిగా మారిన సుకుమార్ ఒక్క దగ్గర చేరి సినిమాల గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు బయటకు వస్తాయి కదా. అవును.. లైగర్ సినిమా విడుదల సందర్భంగా పూరిని ఇంటర్వ్యూ చేశారు లెక్కల మాస్టర్ సుకుమార్.

ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు సుకుమార్. వీరి ఇంటర్వ్యూ ఇద్దరు అభిమానులకు ఎంతో మంచి అనుభూతిని కలిగించింది. ఈ సందర్భంగా క్రేజీ డైరెక్టర్ సుకుమార్.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీకి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పారు. పూరి దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు చెప్పారు. అప్పుడు ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు.

 అదే సమయంలో స్టోరీలు రాయడం, క్రియేటివ్ డైరెక్షన్ వెనుకున్న కృషి గురించి చెప్పాలని సుకుమార్..  పూరిని అడిగారు. కథ రాసే సమయంలో తన ఆలోచన ఎలా ఉంటుందో చెప్పాడు పూరి. అయితే లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు నత్తి పెట్టడాన్ని సుకుమార్ ను చూసే నేర్చుకున్నానని పూరి తెలిపారు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భుజం వంకరగా ఉన్నట్లు చూపించారు. దాన్ని చూసే లైగర్ సినిమాలో విజయ్ కి ఆలోపం పెట్టినట్లు వెల్లడించారు.

అంతకు ముందే బన్నీ తనతో ఓ విషయాన్ని చెప్పారని.. హీరోకు ఏదైనా లోపం పెట్టి, అతడి పాత్రను ప్రత్యేకంగా రూపొందించవచ్చు కదా? అని అడిగాడని చెప్పారు. పుష్పలో తన క్యారెక్టర్ ను చూసే లైగర్ సినిమాలో విజయ్ పాత్రను అలా డిజైన్ చేసినట్లు చెప్పారు. విజయ్ పాత్రను ఇలా డిజైన్ చేస్తున్నట్లు బన్నీకి చెప్పగానే.. సూపర్ గా ఉంటుందని చెప్పాడని పూరి వెల్లడించారు. మొత్తంగా ఈ సినిమాలో విజయ్ నత్తి వెనుక బన్నీ ఉన్నారని చెప్పారు.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో ఓ సినిమా చేయాలని చాలా కాలంగా భావిస్తున్నట్లు పూరి వెల్లడించారు. అందులో భాగంగానే  విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ చేశానని చెప్పారు. ఈ సినిమాలో విజయ్ చాలా కష్టపడి నటించాడని చెప్పారు. తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమా కోసం మైక్ టైసన్ ను ఒప్పించేందుకు ఏకంగా ఏడాది సమయం పట్టినట్లు పూరి వివరించారు. ఈ సందర్భంగా తన సినిమాల్లోని హీరోల పాత్రల డిజైన్ గురించి పూరి చాలా విషయాలు చెప్పారు.  

లైగర్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓ రేంజిలో విజయాన్ని అందుకుంటుంది అని భావించినా.. తొలి షో నుంచే నెగిటివ్ టాక్ మొదలయ్యింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన మినహా మరేం బాగాలేదని జనాలు చెప్తున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమా అని చెప్తున్నారు. పూరి ఖాతాలో మరో పెద్ద ఫ్లాప్ చేరినట్లేనని చెబుతున్నారు. అయితే, బాలీవుడ్ టాక్ ఎలా ఉంటుందనేది చూడాలి. 

Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Embed widget