By: ABP Desam | Updated at : 30 Jan 2023 03:28 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@vishal_x_x_7/twitter
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం అర డజన్ కు పైగా సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ‘రాజా డీలక్స్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పలు ఫోటోలు ఇప్పటికే బయకు వచ్చాయి.
తాజాగా దర్శకుడు మారుతి, హీరో ప్రభాస్ కు సంబంధించిన అత్యంత ఖరీదైన లంబోర్గిని కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఇప్పటికే ప్రభాస్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటికి అదనంగా గత ఏడాది లంబోర్గిని వచ్చి చేరింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఇదీ ఒకటి. ప్రభాస్ ప్రస్తుతం ఇదే కారులో మారుతి సినిమా షూటింగ్ దగ్గరికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ బ్రేక్ సమయంలో మారుతి ఈ లంబోర్గిని కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. అలా జాలీగా రోడ్డుపై ఓ రౌండ్ వేసి వచ్చారు. ఈ డ్రైవ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
#Prabhas anna Lamborghini driving by @DirectorMaruthi 🤩👌 pic.twitter.com/RjoAFdFdrQ
— ᴠɪꜱʜᴀʟ 🏹 (@vishal_x_x_7) January 29, 2023
ఇక ప్రభాస్ త్వరలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఆయన ఈ సినిమాలో నటించనున్నారు. వీరిద్దరు హీరోలుగా ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ తో ఓ సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్లు నవీన్ యెర్నేని, రవి శంకర్ వెల్లడించారు. అటు ప్రభాస్ తో సినిమా చేయ్యబోతున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, హృతిక్ హీరోలుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. తాజాగా ‘పఠాన్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సిద్దార్థ్ ఆనంద్, ఇప్పటికే హృతిక్ రోషన్ తో రెండు సినిమాలు చేశాడు. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ సినిమాలతో హృతిక్ రోషన్ కు అదిరిపోయే హిట్స్ అందించాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ప్రభాస్-హృతిక్ రోషన్ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: ‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు
Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!
Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?