అన్వేషించండి

Devatha September 13th Update: గుండెల్ని మెలిపెట్టే సీన్, చిన్మయికి అన్నీ నిజాలు చెప్పిన రుక్మిణి- దేవి మాత్రమే కావాలని సత్యతో తెగేసి చెప్పిన ఆదిత్య

రుక్మిణి మాధవ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకునే టైమ్ కి చిన్మయికి అసలు నిజం తెలుస్తుంది. దీంతో కథనం ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

అవ్వతాతని బాగా చూసుకోవాలి అని రాధ బాధగా చిన్మయికి చెప్తుంది. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ నాకు చెప్తున్నావ్ అని చిన్మయి అడుగుతుంది. రేపటి నుంచి ఈ అమ్మ నీ దగ్గర ఉండదని రాధ అంటుంది. నా దగ్గర ఉండవా ఎక్కడికి వెళ్తావమ్మా నన్ను వదిలేసి అని అడుగుతుంది.

రాధ: రేపు దేవిని తీసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చేది జరగదు

చిన్మయి: ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా, ఎందుకు వెళతావ్ ఎవరు ఏమన్నారు? నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా నన్ను నీతో తీసుకునిపోమ్మా

రాధ: లేదు బిడ్డ నువ్వు ఇక్కడే ఉండాలి.. మీ అవ్వాతాతల కోసమైన ఉండాలి

చిన్మయి: లేదమ్మా అసలు నువ్వు ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నావో చెప్పమ్మా నన్ను వదిలేసి చెల్లిని మాత్రమే తీసుకుని వెళ్తావా అమ్మా

రాధ: నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు నన్నేమి అడగొద్దు అనేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

Also Read: జ్ఞానంబ మీద ఒట్టేసి మరి అబద్ధం చెప్పిన అఖిల్- జెస్సిని తప్పుగా చూపించి జానకికి షాకిచ్చిన అఖిల్

ఆదిత్య రుక్మిణి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు రుక్మిణి అదోలా మాట్లాడింది, ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడింది ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే సత్య వస్తుంది. ఆదిత్య దేవి ఉన్న విషయం గుర్తు చేసుకుని నవ్వుతూ ఉంటే ఎదురుగా నేను ఉన్నాను అనే విషయం గుర్తుందా ఆదిత్య అని సత్య అడుగుతుంది. నేను నవ్వుతూ ఉంటే దానికి కారణం దేవి అనేసరికి సత్య కోపంగా 'దేవి.. దేవి.. ఇదేనా ఇంకో ప్రపంచం ఉండదా నీకు, కట్టుకున్న భార్య గురించి ఆలోచించావా. నన్ను మర్చిపోతున్నావ్. నాతో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడి ఎన్ని రోజులు అయిందో తెలుసా. దేవి మాధవ్ కూతురు పరాయి వాళ్ళ కూతురు. ఇంట్లో మా అక్క కూతురు ఉంది తనతో ప్రేమగా ఉండు' అని సత్య అంటుంది.

దేవి మాత్రం ఎవరు రుక్మిణి కూతురే కదా కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంటి అని ఆదిత్య అడుగుతాడు. 'అక్క కూతురే కానీ నీ అభిమానం మాధవ్ కి అవసరం లేదు కదా అతనితో మాటలు పడుతూ అభిమానం చూపించాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళ గురించి ఎందుకు మనకే పిల్లలు ఉంటే బాగుంటుంది కదా. మన పిల్లల కోసం అమెరికా వెళ్దాం అంటే ఏదో ఒక కారణం చెప్పి దూరం పెడుతున్నావ్.. అసలు నీకు మన పిల్లల అవసరం ఉందా లేదా' అని కోపంగా నిలదిస్తుంది. లేదు నాకు మన పిల్లల అవసరమే లేదు.. వాళ్ళ కోసం అమెరికా కాదు కదా ఎక్కడికి రాను నాకు దేవినే ముఖ్యం. దేవి నా కళ్ల ముందు ఉంటే చాలు అంతక మించి నాకు మరో ఆలోచన లేదు రాదు అని కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Also Read: తులసిని కాళ్ళు పట్టుకుని క్షమించమని నందుని అడగమన్న సామ్రాట్- బిత్తరపోయిన తులసి ఫ్యామిలీ

ఆ మాటలకి సత్య కుమిలి కుమిలి ఏడుస్తుంది. రాధ తెల్లవారితే వెళ్లిపోతాను అంటుంది.. బయట ఇల్లు కూడా చూసుకుంది, అమ్మ కాదు అని తెలియక రాధే ప్రాణంగా బతుకుతున్న చిన్మయికి ఈ విషయం తెలిస్తే బతుకుతుందా అని జానకి బాధ పడుతుంది. చిన్మయి నిద్ర నుంచి లేస్తుంది. దేవి,నేను ఇద్దరం ఒక్కటేగా మరి నన్ను మాత్రమే వదిలేసి ఎందుకు వెళ్లిపోతున్నావ్.. నువ్వు వెళ్లిపోవడానికి కారణం ఇదేనా అని ఆదిత్య, రుక్మిణి పెళ్లి ఫోటో చూపిస్తుంది. అది చూసి రుక్మిణి షాక్ అవుతుంది. 'ఇది చూసిన దగ్గర నుంచి నాకేమీ తెలియడం లేదు ఆఫీసర్ అంకుల్ తో ఈ ఫోటో ఏంటి? నువ్వు కూడా తెలుసని ఆఫీసర్ అంకుల్ మాతో చెప్పలేదేంటి? ఆఫీసర్ అంకుల్ ఎవరు ఇది పెళ్లి ఫోటో కదా నువ్వు ఉన్నావ్ ఏంటి'? అని చిన్మయి అడుగుతుంది.

'ఈ నిజం నా బిడ్డకి చెప్పాల్సిన రోజు వస్తుందని అనుకున్నా కానీ ఈ బిడ్డకి చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ఆఫీసర్ సారు నా పెనిమిటి, దేవి మా ఇద్దరి బిడ్డ, నువ్వు మాధవ్ సారు బిడ్డవి' అని రుక్మిణి చెప్పడంతో చిన్మయి షాక్ అవుతుంది. నేను నీ బిడ్డని కాదా, నువ్వు మా అమ్మవి కాదా అని బాధగా అడుగుతుంది. నిన్ను ఎప్పుడు నా బిడ్డ కాదని అనుకోలేదు, దేవమ్మని ఎలా సాకానో అలాగే చూశాను, పాలిచ్చి పెంచాను అని అంటుంది. అసలేం జరిగిందంటే అని మాధవ్ కారుకు యాక్సిడెంట్ కావడం తనని కాపాడటం అన్నీ చెప్తుంది. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలనమ్మా అని చిన్మయి బాగా ఏడుస్తుంది. ఆ సీన్ గుండెల్ని మెలిపెట్టేస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Embed widget