అన్వేషించండి

Gruhalakshmi September 12th Update: తులసిని కాళ్ళు పట్టుకుని క్షమించమని నందుని అడగమన్న సామ్రాట్- బిత్తరపోయిన తులసి ఫ్యామిలీ

తులసి, సామ్రాట్ మళ్ళీ ఒక్కటయ్యారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

సతీసమేతంగా వచ్చి పూజ చేసుకోవచ్చని తులసి లాస్యతో అంటుంది. హనీని చూసి లాస్య పలకరిస్తుంది. మీ డాడీ రాలేదా అని అడుగుతుంది. వచ్చారు.. బయట కారులో ఉన్నారు అని చెప్పేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు. మరి చెప్పలేదేంటి అని తులసి పెద్దాయన్ని అడుగుతుంది. అవును అనేసరికి తులసి గబగబా బయటకి వెళ్తుంది. పార్టనర్ షిప్ వద్దని ఒక మెసేజ్ పెట్టానని నా మీద కోపంగా ఉన్నారని తులసి మనసులో అనుకుంటుంది. పార్టనర్ షిప్ నుంచి తప్పుకుంటే మాట వరసకి కూడా ఫోన్ చేసి కారణం అడగలేదు నా మీద కోపంగా ఉండి ఉంటారని సామ్రాట్ అనుకుంటాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. తులసి పిలిచినా ఆయన రారులే అని లాస్య నందుతో అంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉండటం ఇంట్లో వాళ్ళు చూస్తారు. ఇద్దరు ఒకేసారి మాట్లాడుకుంటారు. ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా ఇక్కడే ఉండిపోయారు ఏంటి అని తులసి అంటుంది.

ఏ హోదాతో రావాలో అర్థం కాక అని సామ్రాట్ అంటాడు. నేను మీ బాస్ ని కాదు ఎందుకంటే నా కంపెనీతో సంబంధం లేదు బిజినెస్ పార్టనర్ కాదు మీరు తప్పుకున్నారు కాబట్టి ఫ్రెండ్స్ కూడా కాదు కదా మనం మాట్లాడుకోవడం లేదని అంటాడు. మీ మనసులో దాచుకున్నవి, బాధపెట్టినవి ఏవైనా చెప్తారని అనుకుంటున్నా అని సామ్రాట్ అంటాడు. కష్టాలు, బాధలు గుండెల్లో పెట్టుకుని ఉండటం అలవాటు అయిందని తులసి వేదాంతం చెప్తుంది. లోపల అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అని తులసి అంటుంది. కాస్త నవ్వుతూ కూడా రావొచ్చు పెద్ద ఖర్చు కూడా కాదు కదా అని తులసి అనేసరికి సామ్రాట్ నవ్వుతాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ లోపలికి వస్తారు.

Also Read: రాధ గురించి తెలిసి జానకి షాక్- ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడిన సత్య

మీరు ఇలా పండగక్కి రావడం చాలా సంతోషంగా ఉందని ఇంట్లో వాళ్ళు అందరూ అంటాడు. నాతో పాటు నువ్వు కూడా వినాయకుడి పూజలో కూర్చోవాలి అని హనీని అడుగుతుంది. కానీ ఒక్క కండిషన్ అని అభి అంటాడు. మా ఇంటి మీద పడి గొడవ చేసి మా మామ్ ని బ్లెమ్ చేసినందుకు హార్ట్ చేసినందుకు మా మామ్ కి సోరి చెప్పి పూజలో కూర్చోవాలి అని అభి చెప్తాడు. మా ఇద్దరి మధ్య జరిగింది మా వ్యక్తిగతం ఇక్కడ ఉన్న ఎవరికి దానితో సంబంధం లేదని తులసి తేల్చి చెప్తుంది. పూజలో భాగంగా అందరూ కంకణాలు కట్టుకోమని పూజారి చెప్తాడు. తులసి వెళ్ళి సామ్రాట్ కి కంకణం హానితో కట్టిస్తుంది. హనీ తర్వాత తులసి చేతికి కంకణం కడుతుంది.

ఏ ఆటంకం లేకుండా పూజ జరుగుతుంది. నందు దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి రమ్మని అంకితని అభి పిలుస్తాడు. తులసి వెళ్ళమని సైగ చేసేసరికి వెళ్తుంది. ప్రేమ్ మాత్రం తీసుకోవడానికి ఒప్పుకోడు, మొక్కుబడి దండాలు నేను చెయ్యను అని అంటాడు. మీ అమ్మగారే గౌరవం ఇచ్చి మాట వింటుంటే నువ్వు ఏంటి ఇలా అని సామ్రాట్ అంటాడు. సోరి అనిపించి అలా అనేశాను సామ్రాట్ అనేసరికి పర్లేదు సార్ అని ప్రేమ్ అంటాడు.

Also Read: చిత్ర, వైభవ్ ఓవర్ యాక్షన్- కన్నీళ్ళు పెట్టుకున్న వసంత్, వేద, యష్ చిలిపి కొట్లాట

తరువాయి భాగంలో..

ఇది నా జీవితంలో మరపురాని రోజు. వినాయకుడి మహిమ ప్రత్యక్షంగా తెలుసుకున్న రోజు తన బిజినెస్ పార్టనర్ ని తన మాజీ భర్త బతిమలాడుకున్నాడు. తానే మాజీ భర్త అని ఆఫీసులో తెలియనివ్వద్దని చెప్పాడు అనేసరికి అందరు షాక్ అవుతారు. తన మాటకి కట్టుబడి చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించింది. ఆమె చేసిన పనికి మాజీ భర్త కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా తప్పు లేదని అంటాడు.  

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget