Ennenno Janmalabandham September 12th: చిత్ర, వైభవ్ ఓవర్ యాక్షన్- కన్నీళ్ళు పెట్టుకున్న వసంత్, వేద, యష్ చిలిపి కొట్లాట
చిత్ర పెళ్లి వసంత్ తో ఎలాగైనా చెయ్యడానికి వేద ట్రై చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వసంత్, నిధిలని తీసుకుని యష్ షాపింగ్ మాల్ కి వస్తాడు. ఏ ప్రాబ్లం లేకుండా నిధి, వసంత్ ఎంగేజ్మెంట్ జరగబోతుందని యష్ ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడే వేద, చిత్ర హలో.. అంటూ ఎంట్రీ ఇస్తారు. మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. చిత్ర ఎందుకు వచ్చింది, వసంత్ తో పెళ్లి జరగదని చెప్పాను కదా అయిన వసంత్ వద్దంటే మేము ఎందుకు వెంటపడతాము అని వేద అంటుంది. తనకి పెళ్లి సంబంధం కుదిరిందని చిత్ర చెప్తుంది. అమెరికా సంబంధం సాఫ్ట్ వేర్ ఉద్యోగం అని చిత్ర సంబరంగా చెప్తుంది. నీకు కాబోయే వాడు ఎక్కడ అని నిధి అడుగుతుంది. వచ్చేశారు అనగానే రామరావ్(రాధమ్మ కూతురు సీరియల్ యాక్టర్) ఎంట్రీ ఇచ్చేస్తాడు.
వసంత్ చిత్ర పక్కన నిలబడి ఉంటే పక్కకి జరగమని చెప్పి వెళ్ళి తనని కౌగలించుకుంటాడు. అది చూసి వసంత్ మొహం మాడిపోతుంది. ఇతనే వైభవ్.. నాకు కాబోయే భర్త అని యష్ కి చెప్తుంది. చిత్ర వాళ్ళందరిని పరిచయం చేస్తుంది. చిత్రని చూసిన వెంటనే లవ్ లో పడిపోయాను అని ఒక్కరోజులో అమెరికా నుంచి తన కోసం వచ్చేశాను అని వైభవ్ అంటాడు. వాళ్ళిద్దరిని చూసి వసంత్ ఏడుపు మొహం పెట్టేస్తాడు. ఏం జరుగుతుందో అర్థం కాక యష్ కూడా బిక్కమొహం వేస్తాడు. వేదని పిలుస్తాడు. చిత్తు చిత్తు అంటున్నాడు యూఎస్ కి వెళ్ళక ముందు చిత్తు కాగితాలు అమ్ముకునే వాడా అని యష్ అంటాడు. అలా అనకండి తను మా చిత్రకి పెట్టుకున్న ముద్దు పేరు. మీకు నచ్చకపోతే వినకండి అని వేద అంటుంది.
Also Read: 'లైగర్'ని అన్న మోనిత,'లోఫర్'వి అన్న దీప - వినాయక చవితి పూజలో మోనితకు షాక్ ఇచ్చిన కార్తీక్
నిజం చెప్పు ఆ బాబు యూఎస్ రిటర్న్ ఏనా అని అడుగుతాడు. వీసా ఉందేమో అడిగి జిరాక్స్ ఇస్తాను అని వేద అంటుంది. ఇంత సడెన్ గా చిత్రకి పెళ్లి ఎలా కుదిరిందని అడుగుతాడు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు.. ఇది కూడా అలాగే అని వేద అంటే ఏంటి వాడి మొహం చూడగానే కక్కు వచ్చిందా అని కౌంటర్ వేస్తాడు. ఇద్దరి మధ్య కాసేపు చిలిపి కొట్లాట జరుగుతుంది. చిత్ర, వైభవ్ నవ్వుతూ ఉండటం చూసి వసంత్ వేద దగ్గరకి వస్తాడు. చిత్ర పెళ్లి చాలా త్వరగా కుదిరిందే అని అంటాడు. అవును వసంత్ పెళ్లి చేసుకుని వెంటనే అమెరికా వెళ్లిపోతుందని చెప్తుంది. అమెరికా సంబంధం అనగానే ఒకే చెప్పేసిందని అంటుంది.
‘చిత్ర ఎప్పుడు స్టేట్ కూడా దాటలేదు మరి ఇప్పుడు అమెరికా అంటే ఎలా? పెళ్లి అంటే ఎక్స్ కర్షన్ పార్టీ అనుకుంటుందా, అందరికీ దూరంగా ఎవరో తెలియని మనుషుల మధ్య బతకాలి. అయిన చిత్రకి పాని పూరీ అంటే చాలా ఇష్టం. చెప్పాలంటే ఎడిక్ట్ అయిపోయింది. ఇప్పుడు యూఎస్ లో తాను ఉండే చోట పాని పూరీ లేకపోతే ఎంత ఇబ్బంది అయిపోతుంది. ఒకసారి చిత్ర, వైభవ్ కూర్చుని కష్ట సుఖాలు లాభనష్టాలు మాట్లాడుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటే మంచి జరుగుతుందేమో’ వదిన అని వసంత్ అంటాడు. మంచి ఎవరికి నీకా వసంత్ అని వేద అంటుంది. 'అన్నీ ఆలోచించే చిత్ర ఈ నిర్ణయం తీసుకుంది, మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చేసింది, ఇంకా పాని పూరీ అంటావా వైభవ్ చిత్ర కోసం ఏమైనా చేస్తాడు.. అక్కడ పాని పూరీ తినిపించడం అంతా కష్టం ఏమి కాదు నువ్వు ఎలాగైతే నిధిని నీ లైఫ్ లోకి ఇన్వైట్ చేస్తున్నావో అలాగే చిత్ర కూడా వైభవ్ ని అలాగే ఇన్వైట్ చేస్తుంది రిస్క్ తీసుకునే ధైర్యం లేని వాళ్ళు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. నా చెల్లి మంచి చెడులు చూసుకోడానికి నేను ఉన్నాను. సొ చిత్ర గురించి ఆలోచించి టైమ్ వెస్ట్ చేసుకోకుండా నీ లైఫ్ మీద దృష్టి పెట్టు' అని చెప్తుంది. ఆ మాటకి వసంత్ కళ్ల నిండా నీళ్ళతో అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతాడు.
Also Read: వసు విషయంలో నిర్ణయం తీసేసుకున్న రిషి, దేవయాని ఏం చేయబోతోంది!
మాళవికని తీసుకుని ఆదిత్య వేద వాళ్ళు ఉన్న షాపింగ్ మాల్ కి తీసుకుని వస్తాడు. అర్జెంట్ గా షాపింగ్ చెయ్యాలి అని తీసుకొచ్చావ్ కానీ మాల్ అంతా తిప్పుతున్నావ్ ఏంటి ఆది అని మాళవిక అడుగుతుంది. నీకు కావలసింది ఏంటో చెప్తే వాళ్ళే తీసుకొస్తారు కదా అని అంటే లేదు మామ్ మనమే వెతుక్కోవాలి అప్పుడే బాగుంటుందని అంటాడు. ఆదిని అటు యష్, ఇటు వేద ఇద్దరు చూస్తారు.
తరువాయి భాగంలో..
వేద పరిగెత్తుకుంటూ వచ్చి యష్ ని ఢీ కొట్టడంతో ఇద్దరు కింద పడిపోతారు. యష్ నడుము పట్టుకుని నొప్పితో అల్లడిపోతూ ఉంటే వేద అమాయకంగా మొహం పెడుతుంది. నొప్పి ఎక్కువగా ఉందా అని అడుగుతుంది.