By: ABP Desam | Updated at : 09 Sep 2022 11:16 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu September 9 Today Episode 551 ( (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 9 Today Episode 551)
జగతి-మహేంద్ర పెళ్లిరోజు సెలబ్రేషన్స్ ని అడ్డుపెట్టుకుని రిషి-వసుని విడగొట్టాలని దేవయాని ప్లాన్ చేస్తుంది. ఆ విషయం అర్థంకాని వసుధార..పెళ్లిరోజుని సంబరంగా మీరు చేయాలని కోరుతుంది.
వసు: మీరు జగతి మేడం కోసం చేస్తున్నారు అనుకోవద్దు సార్. మహేంద్ర సార్ కూడా ఉన్నారు కదా,ఆయన బాధపడతారు కదా.మీకు మహేంద్ర సార్ అంటే ప్రాణం, మహేంద్ర సార్ కి జగతి మేడం అంటే ప్రాణం. కనుక మీరు మహేంద్ర సార్ మీద ఉన్న ప్రేమని ఇలా చూపిస్తే ఇద్దరూ సంవత్సరం పాటు చాలా ఆనందంగా ఉంటారు
రిషి: మా నాన్న మీద నాకు ప్రేమ ఉందని తెలుసు కదా మళ్లీ ఇలాంటివి ఎందుకు
వసు: ఇప్పుడు పిల్లలు సంవత్సరం అంతా చదువుతారు. పరీక్ష రాస్తేనే కదా వాళ్ళకి వచ్చిన మార్కులు బట్టి వాళ్ళు చదువు తెలిసేది.
అలాగే ఇలాంటి సమయంలో మీరు బైటకి చూపిస్తేనే, మీకు ఎంత ప్రేమ ఉన్నదో వాళ్లకి తెలుస్తుంది. అయినా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పుట్టినరోజులు ఘనంగా జరుపుకుంటే సంవత్సరం అంతా వాళ్లకు గుర్తుండిపోతుంది. మీరే కాని ఈ పెళ్లి రోజుని జరిపేటట్టు చేస్తే, జగతి మేడం,మహీంద్ర సార్ సంవత్సరం వరకు దీన్ని గుర్తుంచుకుంటారు, ఎప్పటికీ మర్చిపోరు. నేను చెప్పవలసింది చెప్పాను సార్ మిమ్మల్ని బలవంతం పెట్టడం నాకు ఇష్టం లేదు ఇంక మీ ఇష్టం అని అంటుంది వసు.
Also Read: శౌర్యని చూసి ఆగిన కార్తీక్, మోనితని టెన్షన్లో పడేసిన దీప!
ఆతర్వాత జగతి-మహేంద్ర రూమ్ లోకి వెళ్లబోతూ బయటే ఆగిపోతాడు రిషి
జగతి: మనం భార్య భర్తలమే కాకుండా తల్లిదండ్రులను కూడా. మన ఆనందం రిషికి బాధ కలిగించవచ్చు అలా బాధ కలిగించే ఆనందం మనకొద్దు మహేంద్ర. ఇప్పటికే రిషి నా వల్ల పడిన బాధ చాలు, ఇప్పటికీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడు భారమవ్వకూడదు. సంవత్సరానికి ఒకసారి వచ్చేది అని నాకు సరదా ఉంటుంది, కానీ రిషి నీ బాధపెట్టే ఏది నాకొద్దు అని అంటుంది జగతి. ఈ మాటలన్నీ రిషి వింటాడు. ఓ వైపు వసుధార చెప్పడంతో ఆలోచనలో పడిన రిషి..జగతి మాటలు విన్న తర్వాత తల్లిదండ్రుల పెళ్లిరోజు గ్రాండ్ గా చేయాలని ఫిక్సవుతాడు. అదే విషయం దేవయానితో చెబుతాడు...
వసు విషయంలో రిషి నిర్ణయం... పెద్దమ్మ ఏం చేయబోతోంది ? #StarMaaSerials #GuppedanthaManasu Mon to Sat at 7.00 pm #StarMaa. pic.twitter.com/YJdjkd7RR9
— starmaa (@StarMaa) September 9, 2022
వసుధార నేను కలసి ప్రయాణిద్దామని నిర్ణయించుకున్నాం పెద్దమ్మా...డాడ్ వాళ్ల మ్యారేజ్ డే అయ్యాక వసుధార వాళ్ల అమ్మానాన్నల్ని కలుద్దాం. ఈ మాట మీ నోటితోనే ఇంట్లో అందరికీ చెప్పండి అంటాడు. రిషి నుంచి అస్సలు ఊహించని రియాక్షన్ ఇది..దీంతో దేవయాని మొహంలో రంగులు మారుతాయి. జగతి-మహేంద్ర పెళ్లిరోజుని అడ్డం పెట్టుకుని చిచ్చు పెడదామనుకుంటే ఇలా అయిందేంటని దేవయాని రగిలిపోతుంటుంది. కానీ రిషి అంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తోంది కాబట్టి రిషి చెప్పమన్నట్టే బయటకు చెప్పినా..ఆ తర్వాత తన బుద్ది ప్రదర్శించే పనిలో పడింది. వసుధార అంటే అస్సలు పడని తండ్రితో చేయికలిపి ఈ పెళ్లి చెడగొట్టేందుకు ప్లాన్ చేసినా చేయొచ్చు...
Also Read: దేవయాని ప్లాన్ రివర్స్ - రిషిని ఆలోచనలో పడేసిన జగతి మాటలు, సంబరం చేద్దామన్న వసు
Naga Panchami December 2nd Episode నాగమణిని తీసుకొస్తే మోక్షని కాపాడుతా.. పంచమితో కరాళి!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
Bigg Boss 7 Telugu: సండే ఎపిసోడ్లో నాని - ప్రియాంకకు మ్యాథ్స్, యావర్‌కు తెలుగు క్లాసులు
Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
/body>