Devatha October 29th: ఎట్టకేలకి దేవి చెంతకి ఆదిత్య, రుక్మిణి- అక్కడ మాధవ్ ఇచ్చిన షాక్ కి బిత్తరపోయిన రాధ
దేవి కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. అదనరీ కంటే ముందు తనకే దేవి చిక్కితే ఆడుకోవాలని ప్లాన్ వేస్తాడు మాధవ్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
స్పృహలో లేని దేవికి అక్కడి స్వామీజీ వైద్యం చేస్తూ ఉంటారు. మాధవ్ తన కల్లబొల్లి ఏడుపులు నటిస్తూ నా బిడ్డ ఇంకా కళ్ళు తెరవలేదు ఏంటి స్వామి అని అడుగుతాడు. తిరిగి తిరిగి అలిసిపోయి బిడ్డకి బెట్ట తగిలింది కాసేపు ఓపిక పట్టండి అని స్వామీజీ చెప్తాడు. తనకి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను, ఆ దేవుడి ముందు తల పగలగొట్టుకుని చచ్చిపోతాను అని నటిస్తాడు. నీ బిడ్డ కొలుకోవడానికి కాస్త సమాయమ పడుతుంది ఓర్పుగా ఉండండి అని స్వామీజీ అంటాడు. కళ్ళ ముందు బిడ్డ అలా ఉంటే చూడలేకపోతున్నా అని నాటకాలు ఆడుతూ ఉంటాడు. మనసులో రాధ, ఆదిత్య ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటాడు.
రుక్మిణి, ఆదిత్య దేవి ఫోటో పట్టుకుని కోయగూడెం వైపుగా వెళ్తు ఉంటారు. అక్కడ ఒక వ్యక్తికి దేవి ఫోటో చూపిస్తే కోయగూడెం పెద్దయ్య దగ్గర ఉందని పాప స్పృహలో లేదని వైద్యం చేస్తున్నారని చెప్తాడు. రుక్మిణి, ఆదిత్య అతని మాటలు విని కంగారు పడతారు. వెంటనే దేవికి వైద్యం చేసే ప్రదేశం దగ్గరకి ఇద్దరు పరుగులు తీస్తారు. దేవుడమ్మ రుక్మిణి ఫోటో ఆదిత్య బుక్ లో దొరికిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే గతంలో రుక్మిణి బతికే ఉందని చెప్పిన స్వామిజీకి ఫోన్ చేస్తుంది. ఆ రోజు మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది.. కానీ ఎందుకు తను మా కళ్ళ ముందుకు రావడం లేదని అడుగుతుంది. అదే విధిరాత అంటే త్వరలోనే నీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం నీ కళ్ళ ముందుకు వస్తుంది చెప్తాడు.
Also Read: అభి, ప్రేమ్ కొట్లాట- తులసిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న పరంధామయ్య
రుక్మిణి, ఆదిత్య దేవికి వైద్యం చేసే దగ్గరకి వస్తారు. దేవి దేవి లె బిడ్డ అని రుక్మిణి, ఆదిత్య అల్లాడిపోతారు. బిడ్డ కోసం ఎక్కడెక్కడో తిరిగాము తన కోసం ఇక్కడికి ఎలా వచ్చిందని రుక్మిణి ఆవేదనగా అడుగుతుంది. తిండీ తిప్పలు లేకుండా తిరగడం వల్ల బిడ్డ బాగా అలిసిపోయింది, దానికి తోడు ఎండ దెబ్బ తగిలి పడిపోతే చూసిన వాళ్ళు తీసుకొచ్చారు అని స్వామీజీ చెప్తాడు. ఇప్పుడు తనకి బాగానే ఉంది కోలుకుంటుందని అంటాడు. ఎందుకు బిడ్డ ఇలా చేశావ్ అని రుక్మిణి ఏడుస్తూ ఉంటుంది. బిడ్డ అంటే మీకు ఎంత ప్రాణం మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుందని స్వామీజీ అంటాడు. తల్లివి నీ కంటే ముందు మీ ఆయన వచ్చి బిడ్డని చూసి అల్లాడిపోతున్నాడని స్వామీజీ చెప్తాడు.
నా పెనిమిటా అని రుక్మిణి ఆశ్చర్యపోతుంది. నా పెనిమిటి ఇక్కడే ఉన్నాడుగా అని ఆదిత్యని చూపిస్తే.. అక్కడి ఉన్న గ్రామస్తులు అవును రాధమ్మ బిడ్డ కోసం మాధవ్ బాబు వచ్చారు దేవిని చూసి చాలా బాధపడ్డారు అని చెప్తారు. ఆ మాటకి రుక్మిణి, ఆదిత్య షాక్ అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాధవ్ గురించి పొగుడుతూ ఉంటే రుక్మిణి రగిలిపోతుంది. అప్పుడే మాధవ్ అక్కడికి వస్తాడు. నా కూతురుకి ఎలా ఉంది కళ్ళు తెరిచిందా అని స్వామిజీని అడుగుతాడు. చూడు రాధ మన దేవి ఎలా ఉందో అని నటిస్తాడు. బిడ్డ కనిపించగానే నీకు ఫోన్ చేశాను కానీ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి భార్య, బిడ్డ అంటే ఎంత ప్రేమ నీకు అని స్వామీజీ అంటాడు.
Also read: గుండె పగిలేలా ఏడుస్తున్న వేద- మాళవిక మీద ఆగ్రహంతో ఊగిపోతున్న అభిమన్యు, ఆజ్యం పోస్తున్న ఖైలాష్
అక్కడి గ్రామస్తులు అందరూ కావాలని స్వామీజీ ముందు రాధ, మాధవ్ భార్యభర్తలుగా చక్కగా ఉంటారు అని పొగుడుతూ ఉంటారు. అది విని ఆదిత్య ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటాడు. రాధ కోపంగా తన వైపు చూడటం చూసి మాధవ్ నవ్వుకుంటాడు. ఇన్ని మాట్లాడుతున్నా నేను ఏమి చేయలేకపోతున్నా అని ఆదిత్య మనసులో బాధపడతాడు.