Devatha july 4 episode: పచ్చబొట్టు వేయించుకోబోయిన దేవి, ఫోన్ విషయంలో జానకి దంపతులకి దొరికిపోయిన రాధ
దేవిని సొంతం చేసుకోవాలని అటు మాధవ ఇటు ఆదిత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీంతో దేవి కేంద్రంగా దేవత సీరియల్ కొనసాగుతోంది. జులై 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
మాధవ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు చూసి దేవి బాధపడుతుంది. నాయన ఇది ఎట్ల వేస్తారు అని అడుగుతుంది దేవి. వాళ్ళ దగ్గర సూది లాంటిది ఉంటుంది దానితో గుచ్చుతూ వేస్తారని చెప్తాడు. మరీ అలా గుచ్చుతుంటే నీకు నొప్పి పుట్టలేద అని దేవి అడుగుతుంది. అప్పుడే అక్కడికి రుక్మిణీ వస్తుంది. దీంతో మాధవ కావాలని నీ నవ్వు మొఖం గుర్తు తెచ్చుకున్నానమ్మ అందుకే సూదులతో కాదు కత్తులతో గుచ్చిన నొప్పి పుట్టదని అంటాడు. ఆ మాటకి రుక్మిణీ కోపంగా మాధవ వైపు చూస్తూ దేవమ్మ స్కూల్ కి టైమ్ అవుతుంటే ముచ్చట ఏంటి అని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది.
ఇక స్కూల్ దగ్గర పచ్చబొట్టు వేసే వ్యక్తి ఉంటాడు. దేవి కూడా వెళ్ళి నాన్న పేరు పచ్చబొట్టు వేయించుకుంటాను అంటుంది. చిన్మయి వద్దు నొప్పి పుడుతుంది అంటే నాయన లాగా నేను కూడా ఆయన మొఖం గుర్తుతెచ్చుకుంటాను అని చిన్మయి చెప్తున్న వినకుండా వెళ్తుంది. మాధవ అని మా నాయన పేరు వెయ్యండని ఆయన్ని అడుగుతుంది. అప్పుడే అక్కడకి వచ్చిన భాగ్యమ్మ దాన్ని చూసి అపుతుంది. ఏంది బిడ్డా ఏం చేస్తున్నవ్ అని కోప్పడుతుంది. పసి పిల్లలు గిసువంటివి వేయించుకుంటే మస్తు నొప్పి ఉంటది అలా చెయ్యకూడదని భాగ్యమ్మ అంటే నాయనని గుర్తు చేసుకుంటే నొప్పి పుట్టదులే అమ్మమ్మ అని దేవి అంటుంది. భాగ్యమ్మ దేవికి నచ్చజెప్పి స్కూల్ కి పంపించేస్తుంది.
నా మనవరాలు మాధవ మీద ఇంత ప్రేమ పెంచుకుంటుంది.. మరీ అసలు నాయన సంగతేంది అని భాగ్యమ్మ మనసులో చాలా కుమిలిపోతుంది. ఇక రుక్మిణీ బాధగా గుడిలో ఉంటే ఆదిత్య వస్తాడు. బిడ్డని నేను నీకు ఎంత దగ్గర చేయాలని ప్రయత్నిస్తున్నానో దేవి నీకు అంతా దూరం అవుతుందని రుక్మిణీ బాధపడుతుంది. దేవికి నిజం తెలియకపోవడం వల్ల కొంచెం దూరంగా ఉంటుంది కానీ నేనంటే చాలా ప్రేమగా ఉంటుందని ఆదిత్య అంటాడు. “నీ దగ్గరకి రావడానికి ఆ ప్రేమ చాలదు పెనిమిటి బిడ్డకి నువ్వంటే మస్త్ ఇష్టం ఉన్నది కానీ అప్పుడు దత్తత ఇస్తాను అంటే వచ్చిందా ఇల్లు వదిలి పోయింది. అందుకే చెప్తున్న ఆ ప్రేమ చాలదు. దేవి నీకు దగ్గర అయితే మేము ఇంట్లో నుంచి వెళ్లిపోతామని ఆ మాధవ సారు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు” అని రుక్మిణీ భయపడుతుంది.
దేవి నీకు దగ్గర అయితే మేము బయటకి వచ్చేస్తాం చిన్మయి తల్లి లేకుండా ఐపోతుందని మాధవ సారు ఇలా చేస్తున్నారని అదిత్యకి రుక్మిణీ అబద్దం చెప్తుంది. నన్ను క్షమించు పెనిమిటి మాధవ సారు నాకోసం అలా చేస్తున్నారని చెప్తే నువ్వు ఊరుకోవు గా సారు ప్రాణం తీస్తావ్ అందుకే ఆ ఇంటి దగ్గర ఉన్న ఇబ్బంది నేకు చెప్పలేకపోతున్న అని రుక్మిణీ మనసులో కుమిలిపోతుంది. తన బిడ్డా అనాధ అవుతుందని నా బిడ్డని నాకు దూరం చేస్తాడా అని ఆదిత్య అంటాడు. మాధవ ఎందుకు అలా చేస్తున్నాడో ఆ పసి మనసుకు అర్థం కాదు. మాధవ సారు చేతి మీద దేవమ్మ పేరు పచ్చ బొట్టు చూసి.. దేవమ్మ కూడా ఆ సారు పేరు పచ్చబొట్టు వేయించుకోవాలని చూసుందని అదిత్యకి చెప్తుంది. సమయానికి మా అమ్మ చూసి దాని ఆపేసింది. అందుకే పెనిమిటి నువ్వు దేవికి ఇంకా దగ్గర కావాలని అంటుంది. దేవిని నిన్ను వీలైనంత త్వరగా మన ఇంటికి తీసుకొచ్చేస్తానని అంటాడు.
ఇక కమల సత్య దగ్గరకి సంతోషంగా వస్తుంది. డాక్టర్ బిడ్డపుట్టే తేదీ చెప్పారని సంబరంగా చెప్తుంది. నాకు కాన్పు అయ్యేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలని అడుగుతుంది. సరే అని సత్య అంటుంది. రోడ్డు మీద గ్రామస్తులతో ఆదిత్య మాట్లాడుతుండగా దేవి కారులో అటువైపుగా వస్తుంది. కాసేపు ఆదిత్యతో మాట్లాడి దేవి వెళ్ళిపోతుంది. రుక్మిణీ ఇంట్లో తన ఫోన్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. జానకి వచ్చి ఏంటి వెతుకుతున్నవని అడుగుతుంది. రాధ ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయిందని చెప్తుంది. ఫోన్ చేస్తే ఎక్కడ ఉందో తెలుస్తుందని నెంబర్ చెప్పమంటారు కానీ రాధ నెంబర్ చెప్పమంటే చెప్పలేకపోతుంది. నీ ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు. మరి ఆ ఫోన్ ఎవరి కోసం వాడుతున్నావో మాకేం అర్థం కావడం లేదని జానకి నిష్టూరంగా మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో రాధ మళ్ళీ వంట గదిలోకి వెళ్ళి ఫోన్ వెతికితే కనిపిస్తుంది.