Devatha August 6th Update: రాధని ఆదిత్య ఇంటికి తీసుకెళ్తున్న మాధవ - రుక్మిణిని వెతికేందుకు సూరితో వెళ్తున్న దేవుడమ్మ
రాధ మీద తనకున్న నీచమైన కోరికను తన స్నేహితుల ముందు బయటపెడతాడు మాధవ. ఇక దేవుడమ్మ రుక్మిణి కోసం సూరితో కలిసి వెళ్ళి వెతకాలని అనుకుంటుంది. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మాధవ ఊత కర్ర లేకుండా మామూలుగా నడుచుకుంటూ ఫ్రెండ్స్ దగ్గరకి వస్తాడు. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టే కదా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంది అని అంటాడు. ఇక ఇంటికి వెళ్తాను అని అనడంతో అదేంటి అప్పుడేనా అని ఫ్రెండ్స్ అంటారు. ఇంటిని మిస్ అవుతున్నాను అని అంటే ఫ్రెండ్స్ వెటకారంగా ఇంటినా లేక రాధనా అంటారు. అయినా పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఆంటీని కావాలనుకుంటున్నావ్ ఏంటి అని అందరూ నవ్వుతారు. ఆ మాటలకి కోపం వచ్చిన మాధవ తన ఫ్రెండ్ ని కొడతాడు. చిన్నప్పటి నుంచి నాకు నచ్చినది ఏదైనా నా సొంతం చేసుకోవాలని అనుకుంటాను ఇప్పుడు కూడా అదే అయిన రాధ మీద ప్రేమ కాదు ఇది. నన్ను నా ఇష్టాన్ని కాదన్నదనే పంతం అని అంటాడు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన మునిలా బతికాను.. ఆ తపస్సుకి దేవుడు ఇచ్చిన వరం రాధ అనుకుని నా ప్రేమని తనకి చెప్పాను తను ఎంత సింపుల్ గా కాదన్నది. కాదు అన్నప్పుడే కావాలని ఆలోచన ఎక్కువ అయింది,మాట్లాడాను మంచిగా చెప్పాను వినలేదు అందుకే నేను వెళ్ళే రూట్ మార్చాను, చివరికి ఆ ఆదిత్య గాడు రంగంలోకి దిగాడు వాడు వచ్చి రాధ కోసం గిరాగిరా తిరుగుతుంటే నాకు వాడిని తప్పించాలని అనిపించింది. రాధ నన్ను కాదన్నది, రాధ కోసం ఆ ఆదిత్య గాడు తిరుగుతున్నాడు. నాది అనుకున్నది తన దారిన తను పోవాలని చూస్తుంటే టాటా చెప్పి పంపించమంటావా.. రాధ ఎప్పటికీ నాదే. ఆ ఆదిత్యే కాదు కదా ఆ దేవుడే వచ్చినా వదిలే ప్రసక్తే లేదు రాధని నాదాన్ని చేసుకుంటాను అని మాధవ అంటాడు.
మాధవ ఇంటికి వస్తాడు. ఏంటి రాధ నేను వస్తాను అని ఊహించలేదు కదా అయినా నా కోసమే ఎదురు చూస్తునట్టు నేను వచ్చేసరికి నువ్వు ఇలా ఎదురు పడటం చాలా ఆనందంగా ఉందని అంటాడు. నువ్వు ఊరిలో లేకుంటే మనసుకి చాలా నిమ్మళంగా ఉంది. నువ్వు వచ్చినవ్ అంటేనే పరేషాన్ గా ఉంది. నేను లేనని ఈ రెండు రోజుల్లో ఏం చేశావో అన్ని చెప్పమంటావ అని మాధవ జరిగింది అంతా చెప్తాడు. దీన్ని బట్టి నీకు ఏం అర్థం అయ్యింది నేను ఇక్కడ లేకపోయినా నా మనసంతా ఇక్కడే ఉంది. దేవికి కరాటే నేర్పిస్తున్నావంట నన్ను కొట్టిద్దామనా.. నేను దేవిని తన నాన్ననే కొట్టేలా తయారు చేశాను. దేవికి వాళ్ళ నాన్న గురించి చెప్పిన మరుక్షణం నువ్వు నేర్పించిన కరాటే ఆదిత్యని కొట్టడానికే ఉపయోగపడుతుందని నవ్వుతాడు. సారు.. నిన్ను అని రుక్మిణి తిట్టబోతుంటే దేవి నాయన అని వచ్చి కౌగలించుకుంటుంది.
ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని ఈశ్వరప్రసాద్ సూరిని తిడతాడు. రుక్మిణి కోసం వదినమ్మ పడుతున్న బాధ చూడలేక వెతుకుతున్నాను అని సూరి చెప్తుంటే అది కూడా సరిగా చెయ్యడం లేదు కదా అని తిడతాడు. జనాలు కొడుతున్నప్పుడు ఆ ఊరికే వెళ్ళడం ఎందుకు అని ఈశ్వరప్రసాద్ అంటే ఆ ఊరిలో కనిపించినప్పుడు అక్కడ కాక ఇంకెక్కడ వెతుకుతాడు అని దేవుడమ్మ అంటుంది. ఆ అమ్మాయి రుక్మిణీలా ఉందా అని సూరిని అడుగుతుంది. నన్ను చూసి కూడా చూడనట్టు గబగబా వెళ్తుంటే నా అనుమానం పెరిగి మన రుక్మిణి అనేది తెలుసుకోవాలని వెళ్తుంటే సరిగ్గా ఊరి జనాలు వచ్చి నన్ను కొడుతున్నారని చెప్తాడు. ఆ అమ్మాయి మన రుక్మిణి అయి ఉండదు రుక్మిణి అయితే నిన్ను చూసి ఎందుకు వెళ్లిపోతుందని ఈశ్వరప్రసాద్ అంటాడు. సూరి చూసిన అమ్మాయి మన రుక్మిణి అని అనుమానంగా ఉందని దేవుడమ్మ కూడా అంటుంది. మన దగ్గరలోనే రుక్మిణిని పెట్టుకుని పట్టించుకోకుండా ఉంటున్నామా అని అనిపిస్తుందని అంటుంది. ఇక దేవుడమ్మ సూరితో కలిసి ఆ ఊరికి వెళ్ళి చూసొద్దామని అనుకుని బయల్దేరతారు. అది విని సత్య ఆపుతుంది. ఎవరో అక్కలా అనిపించి మీరు వెళ్ళడం ఏంటి.. అక్క గురించి ఆలోచిస్తుండటం వల్ల ఎవరో అమ్మాయి రుక్మిణి అక్కలా కనిపించింది అని తనే అక్క అని అనుకుంటున్నారు. నిజంగా మా అక్క ఇంత దగ్గరలో ఉంటే నా కోసం కాకపోయినా మీకోసమైనా రాకుండా ఉంటుందా ఆంటీ. మీరు వెళ్తే జరిగింది అంతా ఊరి వాళ్ళకి చెప్పాలి మీరు చెప్తారా అని అనడంతో దేవుడమ్మ వెళ్ళకుండా ఆగిపోతుంది.
ఇక దేవి మనం ఎక్కడికి వెళ్తున్నామని మాధవని అడుగుతుంది. పక్కనే రుక్మిణి కూడా ఉంటుంది. మనం నీకు ఇష్టమైన చోటుకి మీ ఆఫీసర్ సార్ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పడంతో రుక్మిణి షాక్ అవుతుంది. ఇప్పుడు ఆఫీసర్ సార్ ఇంటికి ఎందుకు వద్దు అని కారు వెనక్కి ఇంటికి తీసుకుపో అంటుంది. ఎప్పుడు వద్దని అనే నాయనే తీసుకుని వెళ్తుంటే నువ్వు వద్దంటావ్ ఏంటి మనం వెళ్ళి ఆఫీసర్ సార్ ని నాయన గురించి అడుగుదామని దేవి అంటుంది. రాధ మాత్రం కారు ఆపమంటుంది కానీ మాధవ ఆఫీసర్ ఇంటి ముందు ఆపుతామని అంటాడు.
Also Read: నేను మోనిత సేమ్ టు సేమ్ అంటోన్న శోభ- సౌందర్య ఇంటికి పెళ్ళిపత్రికలతో వచ్చిన స్వప్న
Also Read: విషం తాగబోయిన దేవయాని- సాక్షితో పెళ్ళికి రిషి ఒప్పుకుంటాడా? వామ్మో దేవయాని స్కెచ్ మామూలుగా లేదుగా