Deepika Padukone : బెదింపులకు భయపడను, దేశం విడిచి వెళ్లను- దీపికా పదుకొణె
Deepika Padukone : తాను అనుకున్నది చేసేందుకు ఏనాడు వెనుకాడలేదని బాలీవుడ్ నటి దీపికా పదుకొణె వెల్లడించింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడలేదని చెప్పింది.
Deepika Padukone: బాలీవుడ్ లో ఐశ్వర్యాయ్ తర్వాత అంతే స్థాయిలో గుర్తింపు, ఫాలోయింగ్ పొందిన నటి దీపికా పదుకొణె. అందం, అభినయం, యాక్షన్ ఏదైనా రెడీ అంటూ ముందుంటుంది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో పెళ్లి తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ మరింత పెరిగింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కతున్న ‘కల్కి 2898 ఏడీ’తో పాటు ‘ఫైటర్’ అనే సినిమాలోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ తో పాటు పలు వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.
భయం అనేది తెలియని కుటుంబంలో పెరిగా- దీపికా
తనకు మంచి అనిపించింది ఎన్ని కష్టాలు ఎదురైనా చేసి చూపిస్తానని చెప్పింది దీపిక. “నాకు ఏదైనా ఒక విషయం కరెక్ట్ అనిపిస్తే కచ్చితంగా దానికి సపోర్టుగా నిలబడతాను. బలంగా నమ్మి ముందుకు వెళ్తాను. నేను ఎవరికీ భయపడలేదు. ఇక ముందు భయపడను కూడా. గతంలో JNU విద్యార్థుల విషయంలోనే వారికి అండగా ఉండాలని భావించాను. అనుకున్నట్లే చేశాను. ఆ సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నాను. కానీ, వాటిని లెక్క చేయకుండా తీసుకున్న స్టాండ్ మీదే నిలబడి ఉన్నాను. విలువలు ఉన్న కుటుంబంలో భయం అనేది తెలియకుండా పెరిగాను. ఒక వేళ ఏదైనా అనుకోకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంటే, సారీ చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను, సిగ్గుపడను” అని దీపిక వివరించింది.
దేశం విడిచి వెళ్లకూడదు అనుకున్నా- దీపికా
ఇక మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన తాను హీరోయిన్ గా రాణించేందుకు ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పింది దీపిక. “మోడల్‌గా నా కెరీర్ స్టార్ట్ చేశా. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నా. ఆ సమయంలో నన్ను ప్యారిస్ కు వెళ్లాలని చాలా మంది సూచించారు. అక్కడ అయితే ఇంకా బాగా రాణిస్తావు అని చెప్పారు. కానీ, నాదేశాన్ని విడిచి నేను ఎందుకు వెళ్లాలి? అని ఆలోచించాను. అయినా, గ్లోబల్ స్టార్ గా ఎదగాలంటే వేరే దేశానికి ఎందుకు పోవాలి? అని ప్రశ్నించుకున్నాను. ఇక్కడ ఉండే గ్లోబల్ స్టార్ గా రాణించాలి అనుకున్నాను. ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్ గా పని చేశాను. ఆ తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జ్యూరీ మెంబర్ గా ఫ్రాన్స్ కు వెళ్లినప్పుడు అక్కడ నా హోర్డింగ్స్ పెట్టారు. వాటిని చూసి నేను అనుకున్నది సాధించాలను అని గర్వంగా ఫీలయ్యాను” అని దీపికా వివరించింది.
డిప్రెషన్ తో చాలా ఇబ్బంది పడ్డా- దీపికా
ఇక 2014లో పలు కారణాలతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పింది. డిప్రెషన్ లోకి వెళ్లి చాలా రోజుల పాటు ఎన్నో అవస్థలు పడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత మానసిక ప్రశాంతత కోసం చాలా ప్రయత్నించినట్లు చెప్పింది. రెస్ట్ లేకుండా పనిలో పడి అనవసర ఇబ్బందులకు గురి కాకూడదని భావించినట్లు వివరించింది. అన్నింటికంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం అని గుర్తించినట్లు చెప్పింది.
Read Also: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మిల్కీ బ్యూటీ, బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే?