Nani on Dasara: ‘దసరా’ కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది: హీరో నాని
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న సినిమా ‘దసరా’. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది టీమ్.
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న సినిమా ‘దసరా’. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీను విడుదల చేయడానికి చూస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గా ఉంది. ఈ సినిమాను తెలంగాణలోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామం నేపథ్యంలో జరుగుతుంది. ప్రమోషన్స్ లో హీరోనాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విశేషాల గురించి తెలిపారు.
‘‘నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యా. ఇలాంటి కథలు ఎంతో అరుదుగా వస్తాయి. అందుకే ఈ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలదు. దర్శకుడు శ్రీకాంత్ ది గోదావరి ఖని ప్రాంతమే, వాళ్ల నాన్న దాదాపు 40 ఏళ్లుగా బొగ్గు గనుల్లో డంపర్ గా పని చేశారు. ఆయన మాకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పారు. ఈ స్క్రిప్ట్ వినడానికి శ్రీకాంత్ ను కలసినపుడు తను ఒక హీరోను మెప్పించే విధంగా కథ చెప్పాడు. కథకు సంబంధించి ఆయన విజువల్ సెన్స్ ఎలా ఉందో చూడటానికి కొన్ని సీన్లు చేయమని చెప్పా. వాటిని ఎంతో చక్కగా శ్రీకాంత్ తీసాడు. దీంతో అతను ఈ కథను బాగా తీయగలడని అర్థమైంది’’ అని నాని తెలిపారు.
ఇక సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచించినపుడు కీర్తి సురేష్ అయితే ఈ కథకు బాగా సెట్ అవుతుందని అనిపించిందని అన్నారు నాని. ఈ సినిమా లో ఆమె వెన్నెల పాత్ర లో ఎంతో చక్కగా నటించిందని అన్నారు. ఎందుకంటే కథ మొత్తం వెన్నెల పాత్ర చుట్టూనే తిరుగుందని చెప్పారు. వాస్తవానికి ఈ కథను ముందు శ్రీకాంత్ కీర్తి సురేష్ కు చెప్పినపుడు ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు నాని. తర్వాత ఓ సందర్భంలో తాను ఎందుకు ‘దసరా’ మూవీలోకి రాలేదని ఆమెను అడిగితే తను ఏ స్క్రిప్ట్ విననట్టు బదులిచ్చిందని అన్నారు. దీంతో తాను వెంటనే శ్రీకాంత్ కు ఫోన్ చేసి అడిగితే తాను 3 గంటల పాటు స్క్రిప్ట్ చెప్పానని చెప్పారు నాని. ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉండటంతో తాను శ్రీకాంత్ ఫోటోను కీర్తికి పంపించానని, వెంటనే ఆమె రియలైజ్ అయిందని చెప్పారు. అయితే శ్రీకాంత్ పక్కా తెలంగాణ భాషలో కథ చెప్పడం వలన ఆమె అంతగా అర్థం చేసుకోలేకపోయిందని, దీంతో తర్వాత తాము మరో సారి కథను వినిపించామని చెప్పారు. కథ విన్న తర్వాత ఆమె మనం మళ్లీ మాట్లాడకోకపోయి ఉంటే మంచి కథను మిస్ అయ్యేదానని అని చెప్పిందని చెప్పారు నాని.
ఇక హీరో నాని సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ షూటింగ్ దాదాపు బొగ్గు గనులలో జరిగిందని అన్నారు. షూటింగ్ అంత సులభం కాదని తనకు అర్థమైందని, శారీరకంగానూ మానసికంగానూ ఇబ్బందులు ఉంటాయని తెలిసినా షూటింగ్ చేశామని తెలిపారు. షూటింగ్ సమయంలో సెట్ లో చాలా మంది సిబ్బంది అక్కడి దుమ్ము, అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల అస్వస్థతకు కూడా గురయ్యారని, అవన్నీ తట్టుకొని టీమ్ సినిమా కోసం పనిచేసిందని చెప్పారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా కాదని, ఇది భారతీయ సినిమా అని అన్నారు. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు భాషల్లో మార్చి 30 న విడుదల చేయనున్నారు.
Also Read: పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర లోకేష్ - వీడియో వదిలిన కొత్త జంట