By: ABP Desam | Updated at : 26 Aug 2023 01:45 PM (IST)
Photo Credit: Yuvraj Singh/Instagram
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన ఫ్యామిలీలోకి మరో పర్సన్ ని ఆహ్వానించాడు. ఆయన భార్య హాజెల్ కీచర్ తాజాగా బంగారం లాంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువీ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అభిమానుతో గుడ్ న్యూస్ పంచుకున్నాడు. తమ చిన్నారికి అప్పుడే పేరు కూడా పెట్టినట్లు వివరించాడు. ‘ఆరా’ అనే పేరు ఫిక్స్ చేసినట్లు వెల్లడించాడు. ఆమె రాకతో తమ ఫ్యామిలీ ఫుల్ ఫిల్ అయినట్లు చెప్పాడు. గత ఏడాది వీరిద్దరికి ఓ బాబు పుట్టాడు. అతడికి ఓరియోన్ అని పేరు పెట్టారు.
తాజాగా తన కూతురుకు సంబంధించిన ఫోటోలను యూవీ షేర్ చేశారు. భార్య హజెల్ కీచ్ బాబుకు పాలు పట్టిస్తుండగా, యువీ చిన్నారిని ఎత్తుకుని పాలు పెడుతున్నాడు. ఈ ఫోటోకు చక్కటి క్యాప్షన్ రాశాడు. ‘‘మా యువరాణి ఆరా వచ్చేసింది. ఆమె కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. అయినా, సంతోషంగానే ఉంది. ఆరా రాకతో మా కుటుంబం సంపూర్ణం అయ్యింది” అని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సినీ, క్రీడా ప్రముఖులతో పాటు అభిమానులు యూవీ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
టీమిండియా ఆల్ రౌండర్ గా కొనసాగిన యూవీ 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. భారత క్రికెట్ జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. 2007లో టీమిండియా టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ఆయన ఎంతో కృషి చేశాడు. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. యువరాజ్ అనగానే 2007 టీ20 ప్రపంచ కప్ గుర్తొస్తుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆల్ రౌండర్ గా రాణించాడు. బ్యాటింగ్ లో 362 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 15 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును యువరాజ్ అందుకున్నాడు. క్యాన్సర్ మహమ్మారి సోకి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు యూవీ. చికిత్స తర్వాత తిరిగి కోలుకున్నాడు. ఆ తర్వాత తిరిగి క్రికెట్ జట్టులోకి అడుగు పెట్టి అద్భుత ఆటతీరుతో అలరించాడు. 2019లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.
అటు మోడల్, బాలీవుడ్ నటి అయిన హాజల్ కీచ్ ను యువీ ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమారు 4 ఏండ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. 2016, నవంబరు 30న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. జనవరి 25, 2022లో బాబు ఓరియోన్ జన్మించాడు. తాజాగా కూతురు ఆరా పుట్టింది.
Read Also: 'సలార్'లో ప్రభాస్ డ్యుయెల్ రోల్! తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపించనున్నాడా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss Season 7 Telugu: శోభాశెట్టితో సందీప్ కుమ్మక్కు? గౌతమ్‌కు అన్యాయం - ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది!
Bigg Boss Telugu: బిగ్ బాస్ ‘బొచ్చు’ ఫాంటసీ - కంటెస్టెంట్లకు క్షవరం తప్పదా, ఆయనకైతే ఏకంగా అరగుండు!
Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
/body>