By: ABP Desam | Updated at : 26 Aug 2023 12:18 PM (IST)
Photo Credit: Hombale Films/twitter
పాన్ ఇండియన్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు భారతీయ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేశారు. సినీ అభిమానుల నుంచి ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ చూద్దామా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా ఓ కీలక విషయం బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి, కొడుకు పాత్రల్లో ప్రభాస్ నటిస్తున్నట్లు సమాచారం. 1000 మంది ప్రత్యర్థులతో తండ్రి, కొడుకులు కలిసి పోరాడే యాక్షన్ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రభాస్ ను వెయ్యి మంది శత్రువులు చుట్టుముట్టడంతో, అతడిని రక్షించడానికి మరో ప్రభాస్ వస్తాడని తెలుస్తోంది. శత్రువుల బారి నుంచి కాపాడుతాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇక 'KGF' సిరీస్ సక్సెస్ తో దానికి మించిన విజయాన్ని అందుకునేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే నిర్మాణ సంస్థ ఈ చిత్రం కోసం భారీగా బడ్జెట్ సమకూర్చుతోంది. సుమారు రూ. 400 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే తొలి భాగం షూటింగ్ పూర్తి చేసుకోగా, పోస్టు ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో శృతిహాసన్ 'ఆధ్య' అనే జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా 'సలార్' మూవీ రాబోతుందని తాజాగా విడుదల చేసిన టీజర్ లో స్పష్టం చేశారు మేకర్స్. 'సలార్' పార్ట్ -1 ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. అటు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ ‘Kalki 2898 AD’ లోనూ నటిస్తున్నారు. మరోవైపు మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
Aditya L1: ఇస్రో కీలక అప్డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
/body>