Comedian Ali Pawan Kalyan: నా కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించా, కానీ..: అలీ
గత కొంత కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటుడు అలీ మధ్య గ్యాప్ రావడంపై సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ తో విభేదాలపై నటుడు అలీ క్లారిటీ ఇచ్చారు.
గత కొంత కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటుడు అలీ మధ్య గ్యాప్ రావడంపై సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, అలీ రాజకీయాల్లో వేరు వేరే పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో రాజకీయంగా మొదలైన వీరి విభేదాలు వ్యక్తిగత మనస్పర్థలుగా మారాయనే టాక్ వచ్చింది. దీనికితోడు పవన్ కళ్యాణ్ రీసెంట్ సినిమాలలో అలీ అసలు కనిపించకపోవడం, అలాగే ఇటీవల జరిగిన అలీ కూతురి పెళ్లికి పవన్ హాజరుకాకపోవడం వంటి విషయాలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. దీనిపై నటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటుడు అలీ హోస్ట్ గా నిర్వహిస్తోన్న ‘అలీతో సరదాగా’ టాక్ షో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 300 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుందీ టాక్ షో. దీంతో తాత్కాలికంగా ఈ షో కు విరామం ఇచ్చారు. దీంతో ముగింపు ఎపిసోడ్ గా యాంకర్ సుమ అలీను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ‘అలీతో సరదాగా’ కార్యక్రంతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా చెప్పుకొచ్చారు అలీ. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో గ్యాప్ ఎందుకు వచ్చింది అని యాంకర్ సుమా అడగగా.. తమ మధ్య గ్యాప్ రాలేదని, క్రియేట్ చేశారు అని చెప్పుకొచ్చారు అలీ.
రాజీకీయంగా వివిధ పార్టీలలో ఉన్నా.. తాము వ్యక్తిగతంగా మంచి మిత్రులుగానే ఉన్నామని అన్నారు. అయితే కొంత మంది తమ మధ్య గొడవలు జరిగినట్లు ఫేక్ వార్తలు రాశారు అని అన్నారు. వాస్తవానికి తన కుమార్తె పెళ్లికి కార్డు ఇవ్వడానికి వెళ్లినపుడు చాలా సేపు కూర్చొని మాట్లాడుకున్నామని, తన కుమార్తె పెళ్లికి వచ్చే సమయంలో ఫ్లైట్ మిస్ కావడం వలన హాజరుకాలేకపోయారని చెప్పారు. కానీ ఇవన్నీ బయట ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. తమ మధ్య గ్యాప్ వచ్చిందనేది అవాస్తవమని, అదంతా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వాళ్లపనేనని స్పష్టం చేశారు. దీంతో పవన్, అలీకు మధ్య చెడిందనే వార్తలకు తెరపడింది.
Also Read: వంటింట్లో చున్నీ అంటుకుని.. అక్కను తలచుకుని భావోద్వేగానికి గురైన అలీ
ఇండస్ట్రీలో పవన్, అలీ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. దాదాపు పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాల్లోనూ అలీ కనిపిస్తారు. సినిమాల్లో వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. అయితే 2019 ఎన్నికల తర్వాత పవన్, అలీ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత వీరిద్దరూ తెరపై కలసి కనిపించిన సన్నివేశాలు లేవు. వ్యక్తిగతంగానూ ఒకటి రెండు కార్యక్రమాల్లో కలిసినా క్లోస్ గా మాట్లాడుకున్న సంర్భాలు లేవు. మొన్నామధ్య అలీకి రాజకీయంగా ఓ పదవి వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి. దీంతో అలీ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ఈ మధ్య అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ మధ్య విభేదాలు ఏమీ లేవని త్వరలో ఆయన సినిమాలో తాను నటిస్తాను అని అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో పవన్ తో గ్యాప్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు అలీ. మరి అలీ చెప్పినట్టు ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ తెరపై ఎప్పుడు కనిపిస్తుందో వేచి చూడాలి.