VN Aditya: అమెరికాలో కొత్త సినిమా అనౌన్స్ చేసిన వీఎన్ ఆదిత్య - ఎన్నారైలకు ఆడిషన్స్
VN Aditya Latest Movie: వీఎన్ ఆదిత్య స్పీడ్ పెంచారు. దర్శకత్వానికి కొంత విరామం ఇచ్చిన ఆయన మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. లేటెస్టుగా అమెరికాలో కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
VN Aditya's new movie announced in Dallas: తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు వీఎన్ ఆదిత్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉదయ్ కిరణ్ హీరోగా ఆయన తీసిన 'మనసంతా నువ్వే' ఎవర్ గ్రీన్ హిట్. ఆ తర్వాత 'శ్రీరామ్', కింగ్ అక్కినేని నాగార్జునతో 'నేనున్నాను' వంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు. గతంలో హిట్ సినిమాలు తీసిన ఆయన కొంత కాలంలో దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బిజీ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్నారు. డల్లాస్, అమెరికాలో కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
అంతా డల్లాస్‌లోనే... ఆడిషన్స్ కూడా!
వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో నూతన నిర్మాణ సంస్థ 'ఓఎంజీ ప్రొడక్షన్'లో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఓ సినిమా రూపొందుతోంది. అమెరికాలోని టెక్సాస్ స్టేట్, డల్లాస్ సిటీలో సినిమాను అనౌన్స్ చేశారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన 'లవ్ @ 65' విడుదలకు రెడీ అవుతోంది. మరొక రెండు సినిమాలు పూర్తి చేశారు. అవి ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందు మరొక సినిమా అనౌన్స్ చేశారు.
డల్లాస్ సిటీలో సినిమాను అనౌన్స్ చేయడమే కాదు... అక్కడే సినిమా అంతా తీస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. అనౌన్స్ చేసిన తర్వాత ఆడిషన్స్ కూడా నిర్వహించారు. ఈ సినిమాతో నూతన తారలను ప్రొత్సహించాలని వీఎన్ ఆదిత్య భావిస్తున్నారట. కొత్తవారితో ఫీల్ గుడ్ ఫిల్మ్ తీయాలని ఫిక్స్ అయ్యారట.
Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ... ''కొత్త సినిమా మేం నిర్వహించిన ఆడిషన్స్ సూపర్ హిట్. మన దేశానికి చెందిన ఎన్నారైలు మాత్రమే కాకుండా... స్పానిష్ పీపుల్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, ఏషియన్లతో పాటు అమెరికాలో లోకల్ జనాలు సైతం పాల్గొన్నారు. తెలుగు వారితో పాటు తమిళ, కన్నడ ఎన్నారైలు భారీ సంఖ్యలో వచ్చారు. సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించారు'' అని చెప్పారు.
Also Read: హిందీలో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' - రాజమౌళి సినిమాల తర్వాత ప్రభాసే!
నిర్మాత మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ... ''ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వీఎన్ ఆదిత్య గారు. ఆయన దర్శకత్వంలో మా నిర్మాణ సంస్థలో తొలి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సినిమా చేస్తున్నాం. త్వరలో డల్లాస్ సిటీలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం'' అని చెప్పారు. తమ సినిమా అనౌన్స్‌మెంట్, ఆడిషన్స్ కార్యక్రమానికి సహకరించిన శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి, రష్మి, వరుణ్, జీషన్, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, డా. ఇస్మైల్, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ నిర్మాతలు మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి థాంక్స్ చెప్పారు.
Also Read: ఓటీటీలోకి ఈ వారమే సుధీర్ బాబు 'హరోం హర' - Prime Video, ETV Winలో కాదు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?