Vishnu Manchu On Ginna: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్
విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'జిన్నా' టైటిల్, టైటిల్ ప్రకటనపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వాటి గురించి విష్ణు మంచు పెదవి విప్పలేదు. కానీ, సినిమాపై ఒక అప్‌డేట్ ఇచ్చారు.
విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'జిన్నా' (Ginna Movie). పాకిస్తాన్ నేత జిన్నా పేరు తెలుగు సినిమా పెట్టడం ఏమిటి? పైగా, కలియుగ వైకుంఠ దైవం వేంకటేశ్వర స్వామి వారి ఏడు కొండలపైకి టైటిల్ వచ్చినట్లు ప్రకటన చేయడం ఏమిటి? అని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై వివాదం నెలకొంది. దాని గురించి విష్ణు మంచు స్పందించలేదు. కానీ, సినిమాపై ఒక అప్‌డేట్ ఇచ్చారు.
Vishnu Manchu starts dubbing for Ginna Movie: గాలి నాగేశ్వరరావు పాత్రకు విష్ణు మంచు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. 'జిన్నా' సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు గాలి నాగేశ్వరరావు కదా! ''ఇప్పుడు సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు. అవ డబ్బింగ్ స్టూడియోలో 'జిన్నా'కు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశా'' అని విష్ణు మంచు పేర్కొన్నారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో 'జిన్నా' సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు భాషల్లో విష్ణు డబ్బింగ్ చెబుతున్నారో? లేదంటే తెలుగు, హిందీ, తమిళంలో చెప్పి... మలయాళంలో డబ్బింగ్ ఆర్టిస్టుతో చెప్పిస్తారో? ఎందుకంటే... విష్ణుకు తమిళం, హిందీ వచ్చు. వెయిట్ అండ్ సీ.
Also Read: తాప్సీతో అతడూ అక్కడికి వెళ్ళాడు కానీ...
'జిన్నా'లో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్, రేణుక పాత్రలో సన్నీ లియోన్ నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: హీరోగా 20 ఇయర్స్, మాటలు రావట్లేదు - నితిన్ ఎమోషనల్ మెసేజ్
View this post on Instagram