Vichitra Movie: మదర్ సెంటిమెంట్‌తో హారర్ థ్రిల్లర్... 'విచిత్ర' సెన్సార్ పూర్తి
Horror Thriller Vichitra Update: హారర్ సినిమాల జోరు మళ్ళీ పెరిగింది. స్టార్ హీరోలతో పాటు చిన్న దర్శక నిర్మాతలూ హారర్ సినిమాలు తీయడం మొదలు పెట్టారు. అందులో 'విచిత్ర' ఒకటి. సెన్సార్ పూర్తి చేసుకుంది.

హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో హారర్ థ్రిల్లర్స్ తీస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ జానర్ జోరు పెరిగింది. స్టార్ హీరోలు మాత్రమే కాదు... చిన్న దర్శక నిర్మాతలు సైతం మళ్ళీ హారర్ సినిమాలు తీయడం మొదలు పెట్టారు. అందులో 'విచిత్ర' ఒకటి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
మదర్ సెంటిమెంట్‌తో 'విచిత్ర'
'విచిత్ర'లో రవి, శ్రేయ తివారి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని సిస్ ఫిలిమ్స్ పతాకంపై సైఫుద్దీన్ మాలిక్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతోంది. కుటుంబ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా మదర్ సెంటిమెంట్, హారర్ అంశాలు మేళవించి 'విచిత్ర' తీశామని దర్శక నిర్మాత తెలిపారు.
Also Read: పూజతో 'స్పిరిట్' షూటింగ్ షురూ... మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా - ప్రభాస్ ఎక్కడ?
'విచిత్ర' చిత్రీకరణతో పాటు సెన్సార్ పనులు పూర్తి అయ్యాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ... ''రవి, శ్రేయ తివారి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జ్యోతి అపూర్వ, 'బేబీ' శ్రీ హర్షిణి యషిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రతి కుటుంబంలో తల్లి త్యాగం, ప్రేమ, అనుబంధం గురించి ఆలోచింపజేసేలా కథతో సినిమా తీశాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కూర్పు: కడిమి శెట్టి లక్ష్మీనారాయణ, సంగీతం: నిజాని - అంజన్, నిర్మాణం - దర్శకత్వం: సైఫుద్దీన్ మాలిక్.
Also Read: 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు





















