అన్వేషించండి

Operation Valentine OTT : వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీ పార్ట్నర్ లాక్ - స్ట్రీమింగ్ అందులోనే?

Operation Valentine : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.

Mega Prince Varun Tej’s Operation Valentine seals its OTT partner : 'గాండీవ దారి అర్జున' వంటి ప్లాప్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని ఆధారంగా తీసుకుని వైమానిక దాడి ప్రధాన అంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ కు హెడ్ గా కెప్టెన్ రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకుంటున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
 
అందుకే ఈసారి సరికొత్త జోనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈమె ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. టెక్నికల్ గా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీసినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. వైమానిక దాడిని ప్రధాన అంశంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో యుద్ధ విమానాల విన్యాసాలు అబ్బురపరిచే విధంగా ఉండబోతున్నాయి. అందుకు శాంపిల్ గా టీజర్ లో కొన్ని షాట్స్ చూపించారు.
 
అంతేకాదు వైమానికి దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాలను, దేశాన్ని కాపాడడంలో వారు ఎదుర్కుంటున్న సమస్యలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ ద్వారా ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఎవరో రివీల్ అయింది. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. స్ట్రీమింగ్ పార్ట్నర్ ప్రైమ్ వీడియో అని మేకర్స్ టీజర్ ద్వారా వెల్లడించారు. కాకా డిసెంబర్ నెలలోనే ఈ సినిమాని ముందుగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా రిలీజ్ ని పోస్ట్ ఫోన్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.
 
మూవీ థియేట్రికల్ పూర్తయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. థియేటర్లో రిలీజ్ అయిన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాతే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ ద్వి భాష చిత్రంగా రూపొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లు భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీజీ మేయర్ సంగీతం సమకూర్చారు.
 

టాప్ హెడ్ లైన్స్

Irumudi Three Days Collections : ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
Eshwar Sai Madhuri Rathod : అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
Alpha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆలియా భట్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆలియా భట్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
YS Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
Embed widget