By: ABP Desam | Updated at : 20 Dec 2023 03:30 PM (IST)
Image Credit: Animal/Twitter
Animal OTT Release: ‘యానిమల్’ సినిమా అనేది 3 గంటల 21 నిమిషాల డ్యూరేషన్‌తో విడుదలయ్యి థియేటర్లలో సంచలనం సృష్టించింది. దాదాపు రెండు వారాల వరకు ఈ సినిమా హౌజ్‌ఫుల్ షోలతో రన్ అయ్యింది. ఇప్పటికీ బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. థియేటర్లలో చూడనివాళ్లు మాత్రమే కాదు.. చూసినవాళ్లు కూడా ‘యానిమల్’.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే థియేటర్లలో కట్ అయిన కొన్ని సీన్స్‌ను ఓటీటీలో యాడ్ అవుతాయని ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పుడు అలా జరగదు అని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇందులో ఏది నిజమో తెలియక ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.
4 గంటల సినిమా..
2023లో విడుదలయిన ఎన్నో సినిమాల్లో ‘యానిమల్’ అనేది అతిపెద్ద హిట్ అందుకున్న చిత్రాల లిస్ట్‌లో చేరిపోయింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి తనే ఎడిటర్‌గా కూడా వ్యవహరించాడు. అందుకే తను ఇష్టపడి తెరకెక్కించిన సినిమాను కట్ చేయడం ఇష్టం లేక.. అతి తక్కువ ఎడిటింగ్‌తో థియేటర్లలో విడుదల చేశాడు. ఈరోజుల్లో 3 గంటల 21 నిమిషాల సినిమాను ఎవరూ చూడడం లేదని చాలామంది హెచ్చరించినా.. వినకుండా అలాగే థియేటర్లలో రిలీజ్ చేశాడు. సందీప్ నమ్మినట్టుగానే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఓటీటీలో మాత్రం ‘యానిమల్’ ఏకంగా 4 గంటల డ్యూరేషన్‌తో విడుదల అవుతుందని వార్తలు మొదలవ్వడంతో ఈ మూవీని ఇష్టపడినవారంతా ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. కానీ అంతలోనే వారికి బ్యాడ్ న్యూస్ ఎదురయ్యింది. ‘‘అది అవ్వదమ్మ’’ అంటూ నెట్‌ఫ్లిక్స్ బాంబు పేల్చింది.
నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం..
‘యానిమల్’ మూవీ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో రణబీర్ కపూర్, విలన్ బాబీ డియోల్ మధ్య ఇంటెన్స్ ఫైట్ సీన్ ఉంది. ఆ సీన్.. చాలామంది యాక్షన్ మూవీ లవర్స్‌ను కట్టిపడేసింది. అయితే ఆ సీన్ మధ్యలో బాబీ డియోల్.. రణబీర్ కపూర్‌ను ముద్దుపెట్టుకున్నానని, కానీ అది థియేటర్లలో విడుదల చేయలేదని, ఓటీటీ వర్షన్‌లో ఆ సినిమా ఉంటుందేమో అని బయటపెట్టాడు. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం బాలీవుడ్ సినిమాల విడుదల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటినుంచి కేవలం సెన్సార్ అప్రూవ్ చేసిన థియేటర్ వర్షన్స్ మాత్రమే విడుదల చేయాలని, అన్‌కట్ వర్షన్స్ విడుదల చేయకూడదని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుందట.
మరెన్నో సీన్స్..
నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ‘యానిమల్’లోని కేవలం రణబీర్ కపూర్, బాబీ డియోల్ ముద్దు సీన్ మాత్రమే కాదు.. మరెన్నో సీన్స్ ప్రేక్షకుల ముందుకు రాకుండానే మిగిలిపోతాయి. ఈమధ్యకాలంలో థియేటర్లలో విడుదలయిన సినిమాలు కాకుండా ఓటీటీలో ఆ సినిమాలకు సంబంధించిన అన్‌కట్ వర్షన్స్ విడుదల చేయడం ట్రెండ్‌గా మారింది. కానీ నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఇతర ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌పై కూడా ప్రభావం చూపిస్తుందని మూవీ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రణబీర్, తృప్తి మధ్య సీన్స్ కూడా ఓటీటీలో విడుదలవుతాయని మూవీ టీమ్ ప్రకటించింది. కానీ నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి.. మేకర్స్ కూడా ఎదురు వెళ్లలేని పరిస్థితి ఉంది.
Also Read: ‘యానిమల్‘ 3 కోసం సందీప్ వంగా ప్లాన్, ‘యానిమల్ పార్క్’ మొదలయ్యేది అప్పుడే!
The Raja Saab Director: ప్రభాస్ మీడియం రేంజ్ హీరోనా? కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి
Case Against YouTuber Anvesh: కరాటే కళ్యాణి ఫిర్యాదు.. యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు
Nayanthara: 'టాక్సిక్'లో నయన్... పేరు ట్రెడిషనల్, ఫస్ట్ లుక్ ఫుల్ మోడ్రన్!
OTT Malayalam Movies: 'ఏకో' నుంచి 'ఇన్నోసెంట్' వరకు... ఈ వారం ఓటీటీల్లో మలయాళ సినిమాల సందడి - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Malaika Arora: యంగ్ ఏజ్‌లో పెళ్లి వద్దు... అమ్మాయిలకు సలహా, విడాకులు, మళ్ళీ పెళ్లిపై మలైకా ఏం చెప్పిందంటే?
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Hyderabad Latest News: హైదరాబాద్ దాహం తీర్చేందుకు సరికొత్త ప్లాన్! ఇంటింటికీ 24/7 నీరు ఎప్పటి నుంచి అంటే?
Happy New Year 2026 : న్యూ ఇయర్ క్రేజీ ట్రెడీషన్స్.. 12 ద్రాక్షల నుంచి రెడ్ కలర్ ఇన్నర్ వేర్ వరకు, ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం