Varun Tej: పబ్లిక్‌గా సినిమా ప్లాప్ అని ఒప్పుకొన్న వరుణ్ తేజ్
సినిమా ప్లాప్ అని ఒప్పుకోవడానికి నిజాయితీ కావాలి. అదీ విడుదలైన నాలుగు రోజులకు పబ్లిక్‌గా లేఖ రాయడానికి చాలా ధైర్యం కావాలి. తనలో నిజాయితీ, ధైర్యం ఉన్నాయని వరుణ్ తేజ్ ఒక్క లేఖతో చెప్పారు.
సినిమా ప్లాప్ అని ఒప్పుకోవడానికి నిజాయితీ కావాలి. అదీ సినిమా విడుదలైన నాలుగు రోజులకు పబ్లిక్‌గా లేఖ రాయడానికి చాలా ధైర్యం కావాలి. వరుణ్ తేజ్‌లో ఆ ధైర్యం, నిజాయితీ ఉన్నాయని అనుకోవాలి. ఆయన హీరోగా నటించిన 'గని' గత వారం విడుదలైంది. తొలి ఆట నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. వసూళ్ళ పరంగానూ సినిమా విజయం సాధించలేదు. స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని వరుణ్ తేజ్ చాలా ఇష్టపడి 'గని' కథ రెడీ చేయించుకున్నారు. ఆశించిన ఫలితం రాకపోవడంతో సోషల్ మీడియాలో ఆయన ఒక లేఖ రాశారు.
"ఇన్నేళ్ళుగా నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానులకు కృతజ్ఞుడిని. 'గని' చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్. ముఖ్యంగా మా నిర్మాతలు ప్రాణం పెట్టారు. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని మేమంతా చాలా కష్టపడ్డాం. ఎక్కడో మేం అనుకున్న కథను తెరపై సరిగా ఆవిష్కరించలేకపోయాం. ప్రేక్షకులకు వినోదం అందించాలనే ఉద్దేశంతో నేను ప్రతి సినిమా చేస్తా. కొన్నిసార్లు సక్సెస్ అవుతాను. కొన్నిసార్లు పాఠాలు నేర్చుకుంటాను. హార్డ్ వర్క్ చేయడం మాత్రం మానను" అని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.
Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
వరుణ్ తేజ్ లేఖకు మెగాభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. 'కమ్ బ్యాక్ స్ట్రాంగ్' అంటూ రిప్లైలు ఇస్తున్నారు.
Also Read: మహేష్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్- ఒక్క పాట పూర్తైతే చాలు పండగే