Sabari Trailer : చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి వస్తాడు? వరలక్ష్మి శరత్ కుమార్ 'శబరి' ట్రైలర్ చూశారా?
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' చిత్ర ట్రైలర్ ని వరుణ్ సందేశ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. యాక్షన్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది.
Varalaxmi Sarathkumar's Sabari Trailer : నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఓవైపు నెగిటివ్ షేడ్ కలిగిన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల 'హనుమాన్' వంటి పాన్ ఇండియా సినిమాలో మంచి నటన కనబరిచి సక్సెస్ అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే 'శబరి' అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. చాలాకాలం తర్వాత వరలక్ష్మి లీడ్ రోల్ లో నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకోగా.. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా ఉంది.
యాక్షన్ అండ్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో 'శబరి' టైలర్
'శబరి' ట్రైలర్ విషయానికొస్తే.. హీరో వరుణ్ సందేశ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.' చనిపోయిన వ్యక్తి బ్రతికి రావడం అనేది ఎలా పాజిబుల్ అవుతుంది' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత వరలక్ష్మి 'రియా ఎక్కడా?' అని అడగడం బట్టి చూస్తే సినిమాలో వరలక్ష్మికి ఓ కూతురు ఉందని అర్థమవుతోంది. కూతురికి సంబంధించిన కొన్ని సీన్స్ ని కూడా ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్ మొత్తం వరలక్ష్మి కూతురు చుట్టే సాగింది. ఇక టైలర్ చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. సినిమాలో వరలక్ష్మి డ్యూయల్ రోల్ లో నటిస్తుందని ట్రైలర్ చివర్లో చూపించారు. ఈ ట్విస్ట్ తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం శబరి ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఫస్ట్ టైం డ్యూయల్ రోల్‌లో..
సాధారణంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో హీరోయిన్ డ్యూయల్ రోల్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 'శబరి' సినిమాలో వరలక్ష్మి డ్యూయల్ రోల్ లో ఆకట్టుకోబోతోంది. వరలక్ష్మి తన కెరియర్ లో ఇప్పటివరకు డ్యూయల్ రోల్ లో నటించింది లేదు. మొదటిసారి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.
పాన్ ఇండియా రిలీజ్
'శబరి' చిత్రాన్ని అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. మహా మూవీస్ పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన ఈ సినిమాని మే 3న తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. 'హనుమాన్' వంటి పాన్ ఇండియా సక్సెస్ తరువాత వరలక్ష్మి 'శబరి' తో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. కాగా ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, బిందు పగిడిమర్రి, రిషిక బాలి, హర్షిని కోడూరి, బేబీ నివేక్ష, బేబీ కృతిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : నచ్చకపోతే సినిమా చూడటం మానేయండి? 'ఆదిపురుష్' ట్రోల్స్ పై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు!