అన్వేషించండి

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో సీనియర్ హీరోయిన్‌కు కీలక పాత్ర?

హరిశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో సీనియర్ నటి గౌతమి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'బ్రో'(Bro) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా ఫ్యాన్స్ అభిమానులతో పాటూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేసేందుకు హరీష్ శంకర్ తో జతకట్టాడు పవన్ కళ్యాణ్. పవన్ నటిస్తున్న తాజా చిత్రాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఒకటి. 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చాలా కాలానికి వీరి కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ గత మూడు నెలలుగా వాయిదా పడింది.

పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో సమయం దొరికినప్పుడల్లా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' తో పాటు 'ఓజి' మూవీ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ని తిరిగి ప్రారంభించారు. లేటెస్ట్ షెడ్యూల్లో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. పవన్ ఈ షూటింగ్లో అలా జాయిన్ అయ్యాడో లేదో చంద్రబాబు అరెస్ట్ తో మళ్ళీ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక నిన్నే పవన్ మళ్ళీ సెట్స్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో అలనాటి సీనియర్ నటి గౌతమి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్, గౌతమీ లపై హరీష్ శంకర్ కొన్ని కీలక సన్నివేశాలను సైతం చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సినిమాలో ఆమె పవన్ కి తల్లిగా కనిపించనిందని అంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమి ఈ మధ్యకాలంలో పలు తెలుగు చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా గౌతమి 'శాకుంతలం', 'అన్ని మంచి శకునములే' వంటి సినిమాల్లో కనిపించారు. ఇక ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' లోనూ పవన్ కి తల్లిగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమాలో ఈమె నటిస్తున్నట్లు మూవీ టీం నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో పవన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. సినిమాలో రెండో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటూ సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న 'ఓజీ' కూడా చిత్రీకరణ దశలోనే ఉంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఆడియన్స్ నుంచి భారీ స్పందన కనబరిచింది. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాదికే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : దయచేసి అర్థం చేసుకోండి - అఫీషియల్‌గా ఆ మాట చెప్పిన 'సలార్' టీమ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ రేవంత్ రెడ్డి సందడి, ఆకట్టుకుంటున్న సీఎం ఆటతీరు
ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ రేవంత్ రెడ్డి సందడి, ఆకట్టుకుంటున్న సీఎం ఆటతీరు
IPL 2024: రికార్డులన్నీ బెంగళూరువైపే , కీలక మ్యాచ్‌లో ఢిల్లీ మెరుస్తుందా?
రికార్డులన్నీ బెంగళూరువైపే , కీలక మ్యాచ్‌లో ఢిల్లీ మెరుస్తుందా?
Electoral Ink: చూపుడువేలుపై వేసే ఇంక్ బయట లభ్యమవుతుందా? అలా చేస్తే కఠిన చర్యలు - ఈసీ వార్నింగ్
చూపుడువేలుపై వేసే ఇంక్ బయట లభ్యమవుతుందా? అలా చేస్తే కఠిన చర్యలు - ఈసీ వార్నింగ్
IPL 2024: చెన్నై గెలవాలంతే? చెపాక్‌ వేదికగా కీలక సమరం
చెన్నై గెలవాలంతే? చెపాక్‌ వేదికగా కీలక సమరం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Jimmy Anderson Retirement | లార్డ్స్ టెస్టుతో రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన అండర్సన్ | ABP DesamJasprit Bumrah Bowled Sunil Narine | KKR vs MI IPL 2024 మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే | ABP DesamGautam Gambhir Mentor KKR | IPL 2024 కోల్ కతా నైట్ రైడర్స్ కథ తిరగరాసిన గంభీర్ | ABP DesamRohit Sharma Viral Audio With Abhishek Nayar | ఐపీఎల్ లో అనూహ్యంగా ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ రేవంత్ రెడ్డి సందడి, ఆకట్టుకుంటున్న సీఎం ఆటతీరు
ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ రేవంత్ రెడ్డి సందడి, ఆకట్టుకుంటున్న సీఎం ఆటతీరు
IPL 2024: రికార్డులన్నీ బెంగళూరువైపే , కీలక మ్యాచ్‌లో ఢిల్లీ మెరుస్తుందా?
రికార్డులన్నీ బెంగళూరువైపే , కీలక మ్యాచ్‌లో ఢిల్లీ మెరుస్తుందా?
Electoral Ink: చూపుడువేలుపై వేసే ఇంక్ బయట లభ్యమవుతుందా? అలా చేస్తే కఠిన చర్యలు - ఈసీ వార్నింగ్
చూపుడువేలుపై వేసే ఇంక్ బయట లభ్యమవుతుందా? అలా చేస్తే కఠిన చర్యలు - ఈసీ వార్నింగ్
IPL 2024: చెన్నై గెలవాలంతే? చెపాక్‌ వేదికగా కీలక సమరం
చెన్నై గెలవాలంతే? చెపాక్‌ వేదికగా కీలక సమరం
Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
Andhra Elections 2024: ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
Aavesham: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
Embed widget