నాని 'జెర్సీ' రీ రిలీజ్, తండ్రయిన స్టార్ హీరో - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
Manchu Lakshmi Mumbai Home Tour: మంచు లక్ష్మి.. తన డైలీ లైఫ్‌లో జరిగే విషయాలను, తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను.. అన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటుంది. అంతే కాకుండా తన అప్డేట్స్ గురించి యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అప్లోడ్ చేస్తుంటుంది. తాజాగా తాను ముంబాయ్‌కు షిఫ్ట్ అయిపోయాను అని చెప్తూ అక్కడి హోమ్ టూర్ వీడియో ఒకటి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసింది. దీంతో అసలు మంచు లక్ష్మి ముంబాయ్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యింది అని ఆశ్చర్యపోవడంతో పాటు తన ఇల్లు చూసి కూడా షాక్ అవుతున్నారు సబ్‌స్క్రైబర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Nani Jersey Movie Re-Release: నేచురల్ స్టార్ నాని బ్లాక్‌బస్టర్ మూవీ రిరిలీజ్‌కు రెడీ అవుతుంది. ఐదేళ్ల క్రితం నాని నటించిన ఎమోషనల్ డ్రామా జెర్సీ మళ్లీ థియేటర్లో సందడి చేయబోతెంది. కాగా నాని సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. మొన్నటి వరకు అన్ని ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాలే చేస్తూ ఫ్యామిలీ హీరోగా పెరుతెచ్చుకున్నాడు. ఇక చిత్రాల్లో ఖచ్చితంగా ఓ ఎమోషనల్ రైడ్ ఉంటుంది. అలాంటి వాటిలో 'జెర్సీ' చిత్రం ఒక్కటి. స్పోర్డ్స్ డ్రామాగా, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఐదేళ్ల క్రితం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Manchu Manoj and Bhuma Mounika Reddy Blesses With Baby Girl: హీరో మంచు మనోజ్ తండ్రయ్యాడు. అతడి భార్య భూమ మౌనిక రెడ్డి తల్లయ్యింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ సోదరి, నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "వారు నలుగురు అయ్యారు. మా ఇంటి చిన్ని మహాలక్ష్మి అడుగుపెట్టింది. మనోజ్-మౌనికలకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ధైరవ్ చెల్లి రాకతో అన్నయ్య అయిపోయాడు" అంటూ మంచు లక్ష్మి ఈ గుడ్‌న్యూస్ షేర్ చేసింది. దీంతో మనోజ్-మౌనిక దంపతులుకు ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు విషెస్ తెలుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో వారికి ఫ్యాన్స్, నెటిజన్లు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Chiranjeevi Comments on Teja Sajja and Hanuman Movie: మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్‌కి 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన చిరంజీవి 'హనుమాన్' లాంటి సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని, కానీ.. ఆ సినిమాను తేజ సజ్జ చేసేశాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక చిరంజీవి కామెంట్స్‌పై ప్రశాంత్ వర్మ స్పందిస్తూ ఎమోషన్ పోస్ట్ షేర్ చేశాడు. చిరంజీవి గారు తన చిత్రం హనుమాన్‌పై చేసిన కామెంట్స్ ఇంకా తన బాధ్యతను పెంచాయంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మేరకు చిరంజీవి మాట్లాడిన వీడియో కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్ అవుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Vidya Balan About Acting With Star Heroes: కొందరు నటీమణులు యాక్టింగ్ విషయంలో, స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో సక్సెస్ సాధించినా కూడా వారికి ఎక్కువగా అవకాశాలు రావు. ప్రతీ భాషా పరిశ్రమలో ఇలాంటి హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో విద్యా బాలన్ ఒకరు. బాలీవుడ్‌లో బోల్డ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకుంది విద్యా. తను హీరోయిన్‌గా కమర్షియల్ సినిమాల్లో హీరోలతో స్టెప్పులేసిన చిత్రాలకంటే లేడీ ఓరియెంట్ చిత్రాలతోనే ఎక్కువగా గుర్తింపు సాధించింది. తాజాగా తనతో హీరోలు ఎందుకు నటించరు అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ సీనియర్ హీరోయిన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)