అన్వేషించండి

Jersey Re Release: ఐదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లోకి వస్తున్న నాని 'జెర్సీ' - ఆ రోజే రీ-రిలీజ్‌, ఎప్పుడంటే!

Jersey Movie: నాని జెర్సీ మూవీ రీ-రిలీజ్‌కు కాబోతుంది. ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాను మళ్లీ థియేటర్లోకి స్క్రినింగ్‌కు తీసుకువస్తుంది మూవీ టీం. ఎప్పుడంటే..

Nani Jersey Movie Re-Release: నేచురల్‌ స్టార్‌ నాని బ్లాక్‌బస్టర్‌ మూవీ రిరిలీజ్‌కు రెడీ అవుతుంది. ఐదేళ్ల క్రితం నాని నటించిన ఎమోషనల్‌ డ్రామా జెర్సీ మళ్లీ థియేటర్లో సందడి చేయబోతెంది. కాగా నాని సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ బేస్‌ ఉంటుంది. మొన్నటి వరకు అన్ని ఫ్యామిలీ, ఎమోషనల్‌ డ్రామాలే చేస్తూ ఫ్యామిలీ హీరోగా పెరుతెచ్చుకున్నాడు. ఇక చిత్రాల్లో ఖచ్చితంగా ఓ ఎమోషనల్‌ రైడ్‌ ఉంటుంది. అలాంటి వాటిలో 'జెర్సీ' చిత్రం ఒక్కటి. స్పోర్డ్స్‌ డ్రామాగా, ఫాదర్‌ అండ్‌ సన్‌ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఐదేళ్ల క్రితం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.

నాని జెర్సీకి ఐదేళ్లు

Jersey@5.. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటన, అతడు పలికించిన పలికించిన హావభావాలు, ఎమోషన్స్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టున్నాయి.   దసరా చిత్రం కంటే నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన మూవీ ఇది. 2019లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గౌతమ్‌ తిన్ననూరి 'జెర్సీ'ని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రసారంకు వస్తే టీవీలకే అతుక్కుపోయే ఆడియన్స్‌ ఎంతోమంది ఉన్నారు. అంతగా థియేటర్లో ఆదరణపొందిన ఈ సినిమా ఏకంగా రెండు విభాగాల్లో నేషనల్‌ అవార్డును కూడా గెలుచుకుంది. ఇక ఈ సినిమా వచ్చి ఐదేళ్లు కావోస్తుంది. ఏప్రిల్‌ 19తో జెర్సీకి ఐదేళ్లు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా  ఏప్రిల్‌ 20న స్పెషల్‌ షోస్‌ వేయబోతున్నారు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Jersey Re Release: ఐదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లోకి వస్తున్న నాని 'జెర్సీ' - ఆ రోజే రీ-రిలీజ్‌, ఎప్పుడంటే!

ఈ సందర్భంగా  మూవీ మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. మరి ఈ ఏప్రిల్‌ 19న ఈ జెర్సీని బిగ్‌స్క్రీన్‌పై చూసి మరోసారి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందండి. అయితే, 2021 జరిగిన జాతీయ పురస్కారాల్లో ఈ సినిమాకు బెస్ట్ ఎడిటర్ పురస్కారం  విభాగంలో నవీన్ నూలికి దక్కింది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా 2019 ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.50 కోట్ల పైగా గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే రోనిత్, సత్యరాజ్ వంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ఇక్కడ మంచి కమర్షియల్‌ సక్సెస్‌ అవ్వడం, జాతీయ అవార్డులు కూడా గెలవడంతో జెర్సీని హిందీలోనూ రిమేక్‌ చేశారు. అక్కడ కూడా జెర్సీ మంచి విజయం సాధించింది. 

Also Read: తండ్రయిన మంచు మనోజ్‌ - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మౌనిక రెడ్డి

ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల హాయ్‌ నాన్న హట్‌ కొట్టిన నాని అదే జోష్‌లో బ్యాక్‌ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఇది సెట్స్‌పై ఉండగానే 'సాహో' డైరెక్టర్‌  సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇక 'దసరా' డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెలతో మరో మూవీకి కమిట్‌ అయ్యాడు. అంతేకాదు 'బలగం' ఫేమ్ డైరెక్టర్ వేణు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి 'ఎల్లమ్మ' అనే టైటిల్ అనుకుంటున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget