Manchu Manoj: తండ్రయిన మంచు మనోజ్ - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మౌనిక రెడ్డి
Manchu Manoj: మంచు మనోజ్ తండ్రయ్యాడు. ఆయన భార్య మౌనిక రెడ్డి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వారు నలుగురు అయ్యారంటూ మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఈ గుడ్‌న్యూస్ షేర్ చేసింది.
Manchu Manoj and Bhuma Mounika Reddy Blesses With Baby Girl: హీరో మంచు మనోజ్ తండ్రయ్యాడు. అతడి భార్య భూమ మౌనిక రెడ్డి తల్లయ్యింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ సోదరి, నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "వారు నలుగురు అయ్యారు. మా ఇంటి చిన్ని మహాలక్ష్మి అడుగుపెట్టింది. మనోజ్-మౌనికలకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ధైరవ్ చెల్లి రాకతో అన్నయ్య అయిపోయాడు" అంటూ మంచు లక్ష్మి ఈ గుడ్‌న్యూస్ షేర్ చేసింది. దీంతో మనోజ్-మౌనిక దంపతులుకు ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు విషెస్ తెలుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో వారికి ఫ్యాన్స్, నెటిజన్లు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
View this post on Instagram
ఇక వారసురాలి రాకతో మంచు ఇంట సందడి వాతావరణం నెలకొంది. మంచు మోహన్ బాబు మరోసారి తాత అయ్యారంటూ మంచు ఫ్యామిలీ మురిసిపోతుంది. అయితే మనోజ్ బిడ్డు పుట్టినట్టు వెల్లడించిన మంచు లక్ష్మి చిన్నారి ఫోటోను షేర్ చేయలేదు. అయితే తన పోస్ట్‌లో 'ఎమ్‌ఎమ్ పులి' అంటూ తన మేనకోడలిని ముద్దుగా పిలుచుకుంది. దీంతో పాపపేరు ఇదేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కూతురి రాకతో తండ్రయిన మంచు మనోజ్ నుంచి స్వయంగా ప్రకటన ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
కాగా ఇద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. గతంలో వేరువేరుగా పెళ్లి చేసుకున్న వీరిద్దరు మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. కొంతకాలం పాటు రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు గతేడాది మార్చి 3న మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే గర్భం దాల్చిన మౌనికి తాజాగా ఆడిబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే మౌనికకు తన మొదటి భర్తకు ఓ కుమారుడు జన్మించాడు. అతడి పేరే ధైరవ్.
కాగా మంచు మనోజ్ దాదాపు కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మంచు మనోజ్ మళ్లీ తెరమీద కనిపించలేదు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మనోజ్ బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు ప్రకటించాడు. ఒకటి 'వాట్ ద ఫిష్', 'అహం బ్రహ్మస్మి' ప్రకటించాడు. ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు. కానీ, బుల్లితెరపై మాత్రం ఫుల్ సందడి చేస్తున్నాడు. 'ఉస్తాద్' ప్రోగ్రామ్‌కు ఆయన యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక మనోజ్ వాట్ ద ఫిష్ మాత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందకు రానుంది.