Vidya Balan: ఆ విషయాన్ని స్టార్ హీరోలు ఒప్పుకోలేరు, వాళ్లకంటే మేమే బెటర్ - విద్యా బాలన్
Vidya Balan: ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనే పాపులారిటీని సంపాదించుకుంది విద్యా బాలన్. అయితే స్టార్ హీరోలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎందుకు నటించరు అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Vidya Balan About Acting With Star Heroes: కొందరు నటీమణులు యాక్టింగ్ విషయంలో, స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో సక్సెస్ సాధించినా కూడా వారికి ఎక్కువగా అవకాశాలు రావు. ప్రతీ భాషా పరిశ్రమలో ఇలాంటి హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో విద్యా బాలన్ ఒకరు. బాలీవుడ్‌లో బోల్డ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకుంది విద్యా. తను హీరోయిన్‌గా కమర్షియల్ సినిమాల్లో హీరోలతో స్టెప్పులేసిన చిత్రాలకంటే లేడీ ఓరియెంట్ చిత్రాలతోనే ఎక్కువగా గుర్తింపు సాధించింది. తాజాగా తనతో హీరోలు ఎందుకు నటించరు అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ సీనియర్ హీరోయిన్.
అది వాళ్లకే నష్టం..
తను బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధించినా కూడా హీరోలు తనతో నటించడానికి ఇష్టపడేవారు కాదని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది విద్యా బాలన్. ‘‘నాతో కలిసి సినిమాలో నటించడానికి లేదా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కనిపించడానికి హీరోలు ఇప్పటికీ రెడీగా ఉన్నారని నేను అనుకోను. అది వాళ్లకే నష్టం. ఎందుకంటే మేమే హీరోల కంటే మంచి సినిమాలు చేస్తున్నాం. అది నేను నిజంగా నమ్ముతున్నాను. వాళ్లు ఎక్కువగా కమర్షియల్ సినిమాలను చేస్తున్నారు. కానీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువ ఎగ్జైటింగ్‌గా ఉంటున్నాయి. ప్రేక్షకులకు ఇది నచ్చినా కూడా హీరోయిన్లు మెయిన్‌గా నిలబడడం హీరోలు తట్టుకోలేకపోతున్నారు’’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది విద్యా బాలన్.
భయపడుతున్నారు..
‘‘హీరోయిన్లు అందరి దృష్టిని ఆకర్షించడం హీరోలు ఒప్పుకోలేరు. కానీ నేనెప్పుడు దీని గురించి బాధపడలేదు. వాళ్లు భయపడితే నేనేం చేయగలను?’’ అంటూ నవ్వుతూనే హీరోలపై తీవ్రంగా విమర్శలు కురిపించింది విద్యా. ప్రస్తుతం స్టార్ హీరోలపై విద్యా బాలన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను మాత్రమే కాదు.. ఇంతకు ముందు కూడా కంగనా, తాప్సీ లాంటి హీరోయిన్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు ఒప్పుకోరని అన్నారు. అందుకే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వల్ల గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్లు.. తిరిగి స్టార్ల సినిమాల్లో డ్యాన్స్ వరకే పరిమితం అవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
చాలాకాలం తర్వాత..
ఇక చాలాకాలం తర్వాత ఒక హీరోతో కలిసి రొమాంటిక్ కామెడీలో నటించింది విద్యా బాలన్. అదే ‘దో ఔర్ దో ప్యార్’. మోడర్న్ రిలేషన్‌షిప్స్‌పై మూవీ ఆధారపడి ఉంటుందని ఇప్పటికే విడుదలయిన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో విద్యాకు జోడీగా ప్రతీక్ గాంధీ నటించాడు. ఇతర ముఖ్య పాత్రల్లో సెంధిల్ రామమూర్తి, ఇలియానా కనిపించనున్నారు. ఏప్రిల్ 19న విడుదల కానున్న‘దో ఔర్ దో ప్యార్’కు ఇప్పటికే యూత్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. విద్యా బాలన్ మాత్రమే కాదు.. ఇలియానా కూడా చాలాకాలం తర్వాత ఈ మూవీతో రీఎంట్రీ ఇవ్వనుంది. మొత్తానికి ఇద్దరు సీనియర్ హీరోయిన్లు, ఇద్దరు అప్‌కమింగ్ హీరోలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: హృతిక్, ఎన్టీఆర్ పై అదిరిపోయే మాస్ సాంగ్ - రంగంలోకి ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్లు?