ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా ఒక అరుదైన ఫీట్ సాధించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా రవీంద్ర జడేజా టాప్ క్లాస్ అని చెప్పవచ్చు. బ్యాటింగ్‌లో అవసరం అయినప్పుడు చివర్లో వేగంగా పరుగులు చేయగలడు. బౌలింగ్‌లో కూడా కీలక సమయంలో వికెట్లు తీయగలడు. ఇక ఫీల్డింగ్‌లో అయితే ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ ఫీల్డర్లలో ఒకడు. చెన్నై, కోల్‌కతాల మధ్య జరిగిన మ్యాచ్‌లో జడేజా అరుదైన ఫీట్ సాధించాడు. ఇంతవరకు దీన్ని ఐపీఎల్‌లో ఎవరూ సాధించలేదు. ఐపీఎల్ చరిత్రలో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు తీసుకున్న మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఇంకెవరూ ఈ ఫీట్ సాధించలేదు.