క్రికెట్ ఫ్యాన్స్‌కు నేడు ప్రత్యేకమైన రోజు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను ESA (Education and Sports For All) Dayగా ఈ మ్యాచ్‌ను నిర్ణయించారు. ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఒక మ్యాచ్‌ను #ESADay కింద రిజర్వ్ చేస్తారు. దేశంలో ఉన్న ఎన్జీవోల నుంచి 20 వేల మందిని మ్యాచ్‌కు తీసుకెళ్లనున్నారు. పేద పిల్లల కోసం స్పోర్ట్స్, ఎడ్యుకేషన్‌ను సపోర్ట్ చేసేందుకు ముంబై ఇండియన్స్ ప్రయత్నిస్తుంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకు పరిమితం అయింది.