రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆరు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చాలా రికార్డులు నమోదయ్యాయి. జైపూర్‌లో ఇది (184) నాలుగో అత్యధిక లక్ష్యఛేదన. 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరును జోస్ బట్లర్ (100 నాటౌట్) సాధించాడు. టాప్‌లో కేఎల్ రాహుల్ (103 నాటౌట్) ఉన్నాడు. రాజస్తాన్ తరఫున ఏ వికెట్‌కు అయినా నాలుగో అత్యధిక భాగస్వామ్యాన్ని (148) బట్లర్, శామ్సన్ అందించారు. అత్యధిక ఐపీఎల్ సెంచరీల్లో విరాట్ కోహ్లీ (8) టాప్‌లో, జోస్ బట్లర్ (6) మూడో స్థానంలో ఉన్నారు. ఓడిపోయిన మ్యాచ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (3) నిలిచాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక సెంచరీలు (2). ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (110) నిలిచాడు.