ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ వివాదం ఇప్పుడు చిచ్చు పెడుతోంది. రోహిత్ స్థానంలో హార్దిక్‌కు ముంబై కెప్టెన్సీని మేనేజ్‌మెంట్ కట్టబెట్టింది. హార్దిక్ కెప్టెన్సీతో రోహిత్ సంతోషంగా లేడని వార్తలు వస్తున్నాయి. ముంబై క్యాంపు రెండుగా విడిపోయిందని తెలుస్తోంది. ఈ సీజన్ తర్వాత రోహిత్ శర్మ ముంబై నుంచి తప్పుకుంటాడని సమాచారం. జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ వెంట నడుస్తారని తెలుస్తోంది. హార్దిక్ కెప్టెన్సీ అనౌన్స్‌మెంట్ సమయంలో సోషల్ మీడియాలో బుమ్రా, స్కై పోస్టులు పెట్టారు. ఈ నిర్ణయంతో వారు కూడా సంతోషంగా లేరని సమాచారం. తాము ఎంతో విశ్వాసంతో ఉన్నా ఫ్రాంచైజీ తమకు అన్యాయం చేసిందని వారు అనుకుంటున్నారట. రోహిత్, బుమ్రా, సూర్యలు వచ్చే సంవత్సరం మెగా ఆక్షన్‌లో కనిపిస్తారని సమాచారం.