మహేంద్ర సింగ్ ధోని నేడు తిరిగి హైదరాబాద్‌లో రంగంలోకి దిగనున్నాడు. హైదరాబాద్‌లో ధోని రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి హైదరాబాద్‌లో ధోని 22 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 18 ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేశాడు. హైదరాబాద్‌లో ధోని బ్యాటింగ్ యావరేజ్ 48.8 కాగా, స్ట్రైక్ రేట్ 145.2గా ఉంది. హైదరాబాద్‌లో ధోని అత్యధిక స్కోరు 67 నాటౌట్. మొత్తంగా 38 ఫోర్లు, 24 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌పై ధోని ఐదు ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగాడు. ఇందులో 85 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 31గా ఉంది. స్ట్రైక్ రేట్ ఏకంగా 151 కావడం విశేషం.