ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌కు రెండో విజయం దక్కింది. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై మూడు వికెట్లతో విజయం సాదించింది. దీంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ ఆరో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లొ టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 199/4 స్కోరు సాధించింది. పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఈ టార్గెట్‌ను ఛేజ్ చేయగలిగింది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్ (61 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాచ్ గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తనకే దక్కింది. గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లో శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.