Image Source: BCCI/IPL

ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలైంది.

Image Source: BCCI/IPL

కానీ చెన్నై ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Image Source: BCCI/IPL

కేవలం 16 బంతుల్లోనే 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ను మహేంద్ర సింగ్ ధోని ఆడటమే దీనికి కారణం.

Image Source: BCCI/IPL

ఈ క్రమంలో ఆయన అనేక రికార్డులు కూడా బద్దలు కొట్టాడు.

Image Source: BCCI/IPL

టీ20ల్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన మొదటి ఆసియన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ధోని నిలిచాడు.

Image Source: BCCI/IPL

ఒకే ఓవర్‌లో 20 కంటే ఎక్కువ పరుగులు ఎక్కువ సార్లు రాబట్టిన భారతీయ బ్యాటర్ ధోనీనే.

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో ఐదు వేల పరుగులు పూర్తి చేసిన మొదటి వికెట్ కీపర్ బ్యాటర్.

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌ చరిత్రలో 19, 20 ఓవర్లలో 100 సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు.

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో ఛేదన సమయంలో ధోని 35 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.

Image Source: BCCI/IPL

ఇందులో కేవలం ఎనిమిది సందర్భాల్లో మాత్రమే జట్టు ఓటమి పాలైంది.