ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ లిస్టులో టాప్‌లో ఉన్నారు. ఈయన వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా 1160 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్సీ బాధ్యతలు పాటిస్తూ ఫ్లెమింగ్ 882 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆయన కెప్టెన్‌గా 834 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత కెప్టెన్ అజారుద్దీన్ లిస్టులో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఈయన కెప్టెన్‌గా వన్డే వరల్డ్ కప్‌లో 636 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఐదో స్థానంలో నిలిచాడు. వరల్డ్ కప్‌లో గ్రేమ్ స్మిత్ కెప్టెన్‌గా 626 పరుగులు చేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరో స్థానంలో నిలిచాడు. ఇమ్రాన్ వన్డే ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా 615 పరుగులు సాధించాడు.