ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మూడో విజయం దక్కింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 163/5 స్కోరు సాధించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే రెండేసి వికెట్లు తీసుకున్నారు. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో బౌలర్ యష్ ఠాకూర్ ఏకంగా ఐదు వికెట్లు తీసుకోవడం విశేషం. యష్ ఠాకూర్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానానికి చేరుకుంది.