అన్వేషించండి

Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

Telangana News: తెలంగాణలో ప్రస్తుతం విగ్రహావిష్కరణలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ తల్లికి కొత్త రూపు తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు, అది కాంగ్రెస్ విగ్రహం అంటున్న బీఆర్ఎస్. మరి కేసీఆర్ వ్యూహం ఏంటంటే.?

BRS Protest Against New Statue Of Telangana Thalli: డిసెంబర్ 9వ తేదీ సోమవారం.. తెలంగాణలో అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ పార్టీలకు బిగ్ డే. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఏడాది ప్రజా పాలన ముగింపు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలో తెలంగాణ తల్లి (Telangana Thalli) విగ్రహావిష్కరణ కీలక ఘట్టం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసిన విగ్రహాన్ని అధికారికంగా గుర్తించని కాంగ్రెస్ సర్కారు.. ఇటీవల తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సిద్ధం చేయించింది. 'రాచరికపు హావ భావాలకు భిన్నంగా.. వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తాం.' అన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ మేరకు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు.

ఇవీ ప్రత్యేకతలు..

  • కుడి చేతిలో తెలంగాణ ప్రజలు అభయహస్తం చూపుతూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను ధరించి.. గ్రామీణ జీవన విధానం, వ్యవసాయానికి గల ప్రాధాన్యం చాటి చెప్పేలా రూపం ఉంది. 
  • తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా.. ప్రసన్న వదనంతో నిండైన రూపంలో కొలువైంది. ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి.

బీఆర్ఎస్‌కు క్రెడిట్ వస్తుందనే..

అయితే, తెలంగాణ తల్లి కొత్త రూపంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చేతిలో బతుకమ్మ ఉంటే బీఆర్ఎస్‌కు క్రెడిట్ ఉంటుందని.. కాంగ్రెస్ వాళ్లు కావాలనే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేశారు. హస్తం గుర్తు కనిపించేలా తెలంగాణ తల్లి అభయహస్తం ఇస్తున్నట్లు కొత్త రూపం తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ విగ్రహం సవతి తల్లి వంటిదని.. అసలైన తెలంగాణ విగ్రహం తమదే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు తల్లి విగ్రహం.. నగలు, కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాలా.? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, సామాన్య తెలంగాణ మహిళను గుర్తు చేసేలా కొత్త విగ్రహాన్ని రూపొందించినట్లు కాంగ్రెస్ సర్కారు చెబుతోంది.

కేసీఆర్‌కు ఆహ్వానం.. వెళ్తారా.?

అటు, ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌ను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆయన్ను కలిసి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానం పలికారు. అయితే, ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కారని తెలుస్తోంది. తన ప్రొఫైల్ పిక్‌ను ఆయన తాజాగా ఇప్పటివరకూ ఉన్న తెలంగాణ తల్లి ఫోటోనే అప్ డేట్ చేశారు. దీంతో కొత్త రూపంపై ఆయన నిరసన తెలిపినట్లైంది. మరోవైపు, సోమవారం పోటాపోటీగా విగ్రహాల ఆవిష్కరణ ఉంది. ఒకే నగరంలో.. ఒకే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ వేర్వేరు తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సోమవారం కొత్త విగ్రహం ఆవిష్కరించనుండగా.. అదే సమయానికి మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునరావిష్కరించనున్నారు.

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే..

ప్రభుత్వం రూపొందించింది కాంగ్రెస్ తల్లి విగ్రహమని.. తెలంగాణ తల్లి విగ్రహం కాదని బీఆర్ఎస్ మండిపడుతుండగా.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విగ్రహాన్ని మార్చే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా విగ్రహాలు, సంబరాల పాలిటిక్స్ తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read: T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget