అన్వేషించండి

Chiranjeevi About Teja Sajja: 'హనుమాన్' చేయాలన్నది నా కల, తేజ సజ్జపై చిరు కామెంట్స్‌ - ఎమోషనలైన ప్రశాంత్‌ వర్మ

Chiranjeevi: హనుమాన్‌ లాంటి సినిమా చేయాలన్నది తన కల అన్నారు చిరంజీవి. కానీ తేజ సజ్జ చేసేశాడంటూ చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే తేజ సజ్జను చూసి చాలా సంతృప్తి చెందాను అన్నారు.

Chiranjeevi Comments on Teja Sajja and Hanuman Movie: మెగాస్టార్‌ చిరంజీవి కామెంట్స్‌కి 'హనుమాన్' డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఎమోషనల్‌ అయ్యాడు. తాజాగా మీడియాతో ఇంటరాక్ట్‌ అయిన చిరంజీవి 'హనుమాన్‌' లాంటి సినిమా చేయాలనేది తన డ్రీమ్‌ అని, కానీ.. ఆ సినిమాను తేజ సజ్జ చేసేశాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక చిరంజీవి కామెంట్స్‌పై ప్రశాంత్‌ వర్మ స్పందిస్తూ ఎమోషన్‌ పోస్ట్‌ షేర్ చేశాడు.  చిరంజీవి గారు తన చిత్రం హనుమాన్‌పై చేసిన కామెంట్స్‌ ఇంకా తన బాధ్యతను పెంచాయంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఈ మేరకు చిరంజీవి మాట్లాడిన వీడియో కూడా షేర్‌ చేశాడు. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది.

నా సినిమాలు చూస్తూ పెరిగాడు

ఇంతకి అసలేం జరిగిందంటే. ఓ ఈవెంట్‌కు చిరంజీవి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరయ్యాడు. అలాగే కొందరు నటీనటులు, 'హనుమాన్‌'' హీరో తేజ సజ్జ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా షో హోస్ట్‌ చిరుని ఇలా ప్రశ్నించాడు. చాలామంది నటీనటులు మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాల్లో నటిస్తారని ప్రశ్నిస్తే చాలామంది నటీనటులు మీ సినిమాలు పేర్లు చెబుతుంటారు. అలా మీకు ఇలాంటి సినిమాలో నటించాలనే ఆశ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి చిరు మాట్లాడుతూ.. "హా ఉంది. అది చెప్పేముందు మీకు ఒక విషయం చెప్తాను. అక్కడ జాకేట్‌ వేసుకుని కూర్చున్న అబ్బాయి(తేజ సజ్జను ఉద్దేశిస్తూ). హనుమాన్‌ మూవీ చేశాడు. 25 ఏళ్ల క్రితం నా సినిమాతోనే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరిర్‌ మొదలు పెట్టాడు. ఆ తర్వాత నా మరో చిత్రం ఇంద్రలోనూ చేశాడు. అతడికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. అప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ, నన్ను స్ఫూర్తిగా తీసుకుని పెరిగాడు.

హనుమాన్ నా డ్రీమ్ ప్రాజెక్ట్: చిరంజీవి

కానీ, ఇప్పుడు అతడు 'హనుమాన్‌' మూవీ చేసి హను-మ్యాన్‌ అయిపోయాడు.  అయితే, హనుమాన్‌ లాంటి సినిమా నేను చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఇతను ఆ సినిమా చేశాక. నేను చాలా డ్రీం ఫుల్‌ఫిల్‌ అయ్యింది. అతన్ని అలా చూసి నేను చాలా సంత్రప్తి చెందాను. ఎందుకంటే నేను తనని వేరుగా చూడటం లేదు. అతడు నా ప్రయాణంలో ఒక భాగం. ఇప్పుడు తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇండియా మొత్తం అతడిని మెచ్చుకుంటుంది" అంటూ చిరు చెప్పుకొచ్చాడు.  ఇక ఇప్పుడు ఇదే వీడియో క్లిప్‌ని ప్రశాంత్‌ వర్మ షేర్‌ చేస్తూ.. "పద్మవిభూషన్‌ చిరంజీవి గారి లాంటి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ హనుమాన్‌ అనే మాటకంటే ఇంకా గొప్పది ఏముందుంటుంది. ఆయన మాటలు నా బాధ్యతను మరింత పెంచాయి. ఈ మెగా మాటలను నా జీవితం గుర్తుపెట్టుకుంటాను. అలాగే వాటిని ఎప్పటికి గౌరవిస్తూ నిలబెట్టుకుంటాను. ఈ వీడియో చూస్తూ నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఇక స్వయంగా అనుభూతి చెందిన తేజ సజ్జ పరిస్థితి, భావన ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను." అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.   

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget