అన్వేషించండి

Mega157 : చిరు సరసన విశ్వసుందరి - మరి అనుష్క సంగతేంటి?

'బింబిసార' డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో చిరు సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసింది. రీసెంట్ గా చిరు నటించిన 'భోళాశంకర్' బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో చిరు తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రొటీన్ కమర్షియల్, రీమేక్ కథలు కాకుండా ఫ్రెష్ కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీని 'బింబిసార' డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టును త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు.

మూడు లోకాలకు, పంచభూతాలకు సంబంధించిన సోషియో ఫాంటసీ కథతో డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. మొదటి సినిమా 'బింబిసార' తోనే పీరియాడిక్ డ్రామాను సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసి ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు ఈసారి అంతకుమించి మెగాస్టార్ ని చూపించబోతున్నారు. ఈ క్రమంలోనే కథతో పాటు భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంచుకుంటున్నారు. ఇప్పటికే సినిమాలో మెగాస్టార్ కి జోడిగా అనుష్క శెట్టి ని కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అనుష్క ఫ్రెండ్లీ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుండటం, కథ కూడా నచ్చడంతో స్వీటీ కూడా చిరు సరసన నటించేందుకు ఓకే చెప్పిందని టాక్ వినిపించింది. అయితే ఈ చిత్రంలో అనుష్కతో పాటు మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందట. ఆ హీరోయిన్ కోసం విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ని అనుకుంటున్నారని లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాలు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఐశ్వర్యరాయ్ తెలుగులో డైరెక్ట్ గా మూవీ చేసింది లేదు. కేవలం డబ్బింగ్ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఇప్పుడు మెగాస్టార్ మూవీతో డైరెక్ట్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మూవీ టీం ఐశ్వర్యారాయ్ ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే మెగాస్టార్ మూవీ కి బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వార్తపై ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ త్వరలోనే మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ఎం. ఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి - కీరవాణి వీరి కాంబినేషన్లో సినిమా వస్తోంది. 1994లో వచ్చిన 'ఎస్పీ పరశురాం' తర్వాత ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఈ చిత్రంతోపాటు సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాలతో చిరు ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Also Read : పెళ్లికి చావుకు లింకు పెట్టిన నిత్య - ‘కుమారి శ్రీమతి’ టీజర్ చూశారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget