అన్వేషించండి

Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు

ఫిలిప్పీన్స్ లో సోమవారం ఉదయం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. తీవ్రమైన భూకంపం తీవ్రతకు బిల్డింగ్స్ పేకమేడల్లా కూలిపోయాయి. భూకంపం తీవ్రత వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Philippines Earthquake | ఫిలిప్పీన్స్‌లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్ర నమోదైంది. ఉదయం ఒక గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. తీవ్రమైన ప్రకంపనలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూకంపం వల్ల బిల్డింగ్స్ ఊగిపోయిన దశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో శిథిలాలుగా మారిన భవనాల నుండి ఆఫీసులు, స్కూల్స్ వరకు భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల గోడలు కదలడం, వస్తువులు పడిపోయాయి. ఫిలిప్పీన్స్‌లో సంభవించిన ఈ శక్తివంతమైన భూకంపంలో కనీసం 12 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.

ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఫిలిప్పీన్స్ భూకంప, అగ్నిపర్వత శాస్త్ర సంస్థ సూచించింది. భూకంపం తర్వాత మరింతగా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. పౌరులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలను పాటించాలని సలహా ఇచ్చారు.  నష్టాన్ని అంచనా వేయడానికి బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపుతున్నారు.

భూకంపంతో భయపడిన పాఠశాల పిల్లలు

భూ ప్రకంపనల తర్వాత స్కూల్ పిల్లలు భయపడి, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నేలపై కూర్చుని కనిపించారు. ఈ వీడియో ఫిలిప్పీన్స్‌లోని జనరల్ శాంటోస్ నగరంలోని ఐరీనియో నేషనల్ హైవే స్కూల్‌ లో రికార్డ్ చేశారు. భూకంప తీవ్రత తట్టుకోలేక చిన్నారులు ఆందోళనకు గురయ్యారు.

పేకమేడల్లా కూలిపోయిన భవనం

ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం ఎంత శక్తివంతమైనదంటే, జనరల్ శాంటోస్‌లో బిల్డింగ్స్ పేకమేడల్లా కూలిపోయాయి. ఒక భవనం కుప్పకూలిన వీడియో వైరల్ అవుతోంది. 

భవనం కూలిపోయిన భయంకరమైన వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఫిలిప్పీన్స్‌లోని జనరల్ శాంటోస్ నగరంలో సంభవించిన 7.8 తీవ్రత భూకంపం తీవ్రత తెలుపుతుంది. భారీ నిర్మాణం కూలిపోగానే దట్టమైన ధూళి ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. 

శిథిలాలుగా మారిన భవనం

మరో వీడియోలో భారీ భూకంపం తర్వాత ఫిలిప్పీన్స్‌లోని జనరల్ శాంటోస్‌లో జాలిబీ బిల్డింగ్ కూలిపోయిన భయంకరమైన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 

భూకంపం తర్వాత మాల్‌లో గందరగోళం

ఫిలిప్పీన్స్‌లోని మిండానావోలో సంభవించిన 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ తరువాత భవనం కుప్పకూలడం కనిపించింది. దీనివల్ల స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Cross Border Love Story: సరిహద్దులు దాటిన ప్రేమకథ! ఉరీ ఎల్‌ఓసీ వేదికగా స్నాప్‌చాట్ ప్రేమికుల ఎమోషనల్ థ్రిల్లర్! ఎమోషనల్ క్లైమాక్స్
సరిహద్దులు దాటిన ప్రేమకథ! ఉరీ ఎల్‌ఓసీ వేదికగా స్నాప్‌చాట్ ప్రేమికుల ఎమోషనల్ థ్రిల్లర్! ఎమోషనల్ క్లైమాక్స్
Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget