Kumari Srimathi Teaser : పెళ్లికి చావుకు లింకు పెట్టిన నిత్య - ‘కుమారి శ్రీమతి’ టీజర్ చూశారా?
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను నటి కీర్తి సురేష్ విడుదల చేసింది.
‘కుమారి శ్రీమతి’ టీజర్ విడుదల చేసిన కీర్తి సురేష్
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ప్రముఖ నటి కీర్తి సురేష్ ఈ టీజర్ ను ఆవిష్కరించింది. పెళ్లి గురించి అందరూ ఒత్తిడి చేస్తున్నా పట్టించుకోని అమ్మాయి పాత్రలో నిత్యా కనిపించింది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు పెళ్లికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఇందులో చూపించారు. పెళ్లి చేసుకోమని విసిగించే వారికి గట్టిగా సమాధానం చెప్తుంది. నీ కంటే చిన్నవాళ్లు పెళ్లి చేసుకున్నారు? నువ్వెప్పుడు చేసుకుంటావ్? అని అడిగిన ఓ బామ్మకు, నీ కంటే చిన్నవాళ్లు అప్పుడే పోయారు. నువ్వెప్పుడు పోతున్నావ్? అంటూ ముఖం మీదే కడిగిపారేసే మొండిఘటంలా కనిపించింది నిత్య. ప్రస్తుతం ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది.
7 ఎపిసోడ్స్ గా ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్
‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ కు నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా, ఎర్లీ మాన్‌సూన్ టేల్స్ తో కలిసి ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. పల్లెటూరి కథతో 'కుమారి శ్రీమతి' సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్‌లో మొత్తంగా 7 ఎపిసోడ్స్ ఉంటాయని మేకర్స్ వెల్లడించారు. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల పాటు ఉంటుంది.
సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల
ఈ వెబ్ సిరీస్ లో నిరుపమ్, గౌతమీ, తిరువీర్, తాళ్లూరీ రామేశ్వరి, నరేశ్, మురళీ మోహన్ సహా పలువురు నటీటనలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టాకాటో, కమ్రాన్ పాటలు అందించగా, మోహన కృష్ణ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, చందు నిమ్మగడ్డ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కుమారి శ్రీమతి’ సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
ఓటీటీకి ప్రాధానత్య ఇస్తున్న నిత్య
ఇప్పటికే 'బ్రీత్' అనే థ్రిల్లర్ వెబ్ సిరీసులో నటించిన నిత్యా మీనన్, 'మాస్టర్ పీస్' అనే డబ్బింగ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించబోతోంది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం ఆమె వెండి తెరతో పోల్చితే ఓటీటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ‘అలా మొదలైంది’తో తెలుగులోకి అడుగు పెట్టిన ఆమె, ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించింది. ‘భీమ్లానాయక్’ సినిమా తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు.
Read Also: హీరోయిన్‌ను అలా చూడటం ఫస్ట్ టైమ్, దీపికాపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial