అన్వేషించండి

Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు

US Iran War Updates | మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఇజ్రాయెల్ బీరూట్‌పై దాడి చేయగా ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. మళ్లీ దాడి చేస్తే IRGC దీటుగా బదులిస్తుందని హెచ్చరించింది

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇజ్రాయెల్ బీరుట్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది.
  • ఇజ్రాయెల్ అనేక క్షిపణులను అడ్డుకుంది, ఉత్తరాన పేలుళ్లు వినిపించాయి.
  • ఇరు దేశాలు తీవ్ర ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించాయి.

Israel Iran War Updates | వాషింగ్టన్: ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం త్వరలో ఖరారు అవుతుందని చెబుతున్నప్పటికీ, మరోవైపు  ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఏప్రిల్‌లో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ (Ceasefire) తర్వాత క్షిపణి దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ మేఘాలు కమ్ముకున్నాయి. టెహ్రాన్ ప్రతీకార చర్యకు వార్నింగ్ ఇచ్చిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది.

ఇరాన్ మిస్సైల్స్ దాడి తర్వాత, ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో సైరన్ శబ్దాలు వినిపించాయి. అంటే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని దాని అర్థం. ఇజ్రాయెల్ సైన్యం కనీసం మూడు ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకున్నట్లు పేర్కొంది. అయితే ఉత్తరాన అనేక పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. CNN నివేదిక ప్రకారం, కనీసం 10 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఎన్ని మిస్సైల్స్ ప్రయోగించిందో తెలియాల్సి ఉంది.

ఇరాన్ ప్రతీకార దాడి

ఇజ్రాయెల్ ఆదివారం (జూన్ 7) ఏ హెచ్చరిక లేకుండా బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై దాడులకు దిగడం పరిస్థితిని దిగజార్చింది. దాంతో తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. చెప్పినట్లుగానే ఇరాన్ మిస్సైల్స్ దాడులతో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడింది. ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు మళ్లీ మొదలుపెట్టడంతో పశ్చిమాసియా ఘర్షణ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

Also Read: Sahara Desert Tragedy: సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?

దాడి జరిగితే దీటుగా జవాబిస్తాం

తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) స్పందించింది. 'దాడులు జరిగితే ప్రతీకార చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయి. ప్రాంతంలోని అన్ని అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను మేం టార్గెట్ చేస్తామని’ హెచ్చరించింది. లెబనాన్, ఇరాన్ తీరప్రాంతాలు, హర్మూజ్ జలసంధి చుట్టుపక్కల ఉన్న నౌకలపై జరిగిన దాడుల్ని ప్రస్తావించింది. 

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మాట్లాడుతూ, IRGC ఏరోస్పేస్ ఫోర్స్ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌లోని రామాట్ డేవిడ్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. ఈ దాడి ఒక హెచ్చరిక మాత్రమేనని, దాడి మళ్లీ జరిగితే ఇరాన్ ప్రతిస్పందన ఊహించలేరని ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. ఈ ప్రాంతంలోని అన్ని US, ఇజ్రాయెల్ తమ టార్గెట్స్ అవుతాయని IRGC పేర్కొంది. అన్ని రంగాలలో కాల్పుల విరమణ ముగుస్తుందనే షరతుపై ఇరాన్ కాల్పుల విరమణను అంగీకరించిందని, అయితే అమెరికా, ఇజ్రాయెల్ తమ వాగ్దానాలు, హామీలను నెరవేర్చలేదని IRGC క్లారిటీ ఇచ్చింది.

 Also Read: Japan Illegal Mosque Inauguration: జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!

ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి హెచ్చరిక

మరోవైపు, దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సైతం ధీటుగా బదులిస్తామని హెచ్చరించింది.  ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ మాట్లాడుతూ.. 'ఇరాన్ దాడి చేసి పెద్ద తప్పిదం చేసింది. ఆదేశాలు అందిన వెంటనే మేం కూడా శత్రువుపై దాడి చేస్తాం' అని సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ తెలిపారు.

Frequently Asked Questions

ఇరాన్ ఇజ్రాయెల్‌పై ఎందుకు దాడి చేసింది?

జూన్ 7న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ హెచ్చరిక లేకుండా దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా, ఇరాన్ హెచ్చరించినట్లుగానే ఈ మిస్సైల్ దాడి చేసింది.

ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో పరిస్థితి ఎలా ఉంది?

ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయి. ఇజ్రాయెల్ సైన్యం కనీసం మూడు క్షిపణులను అడ్డుకుంది, అయితే ఉత్తరాన పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

ఇరాన్ దాడిపై ఇజ్రాయెల్ ఎలా స్పందించింది?

ఇరాన్ దాడి చేసి పెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఆదేశాలు అందిన వెంటనే శత్రువుపై దాడి చేస్తామని సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ఇచ్చిన హెచ్చరిక ఏమిటి?

దాడులు కొనసాగితే ప్రతీకారం మరింత తీవ్రంగా ఉంటుందని IRGC హెచ్చరించింది. ఈ ప్రాంతంలోని అన్ని US మరియు ఇజ్రాయెల్ లక్ష్యాలు తమ టార్గెట్లు అవుతాయని పేర్కొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Capsized Vietnam: వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
Breaking News: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Embed widget