అన్వేషించండి

RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

RERA Rules : ఫ్లాట్ చేతికి రావడంతో జాప్యం కొనుగోలుదారుకు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. బిల్డర్ గడువును పదేపదే వాయిదా వేస్తుంటే, మీ హక్కుల గురించి తెలుసుకుంటేనే ప్రయోజనం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంటి కొనుగోలులో జాప్యం, కొనుగోలుదారులకు ఆర్థిక సమస్యలు సృష్టిస్తోంది.
  • రెరా చట్టం కింద, ప్రాజెక్ట్ వదిలి వడ్డీతో రీఫండ్ పొందవచ్చు.
  • లేదా ఆలస్యానికి నష్టపరిహారం కోరుతూ, ఈఎంఐలు ఆపకూడదు.

RERA Rules for Delayed Possession: ఇల్లు కొనడం అనేది చాలా మందికి జీవితంలో ముఖ్యమైన విషయం. అతిపెద్ద ఖర్చుతో కూడుకున్న విషయాల్లో ఇది ఒకటి. అయితే బిల్డర్ అనుకున్న సమయానికి ఫ్లాట్ ఇవ్వనప్పుడు, కొనుగోలుదారుల కష్టాలు రెట్టింపవుతాయి. ఒకవైపు హోమ్ లోన్ ఈఎంఐ (EMI) చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు అద్దె ఖర్చులు కొనసాగుతాయి. ఇలాంటి పరిస్థితిలో బిల్డర్ తన మాట నెరవేర్చకపోతే కొనుగోలుదారుడు ఏం చేయవచ్చు తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది. 

దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఇవే ఇబ్బందులు

రియల్ ఎస్టేట్ రంగంలో ఆలస్యం కావడం అనేది కొత్త సమస్య కాదు. నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా లక్షలాది ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది లేదా నిర్ణీత సమయం కంటే చాలా ఏళ్లు వెనుకబడి పనులు నడుస్తుంటాయి. అనేక ప్రాజెక్టులలో కొనుగోలుదారులు 3 నుండి 4 సంవత్సరాల వరకు అదనంగా వేచి ఉండాల్సి వస్తుంది. దీనివల్ల వారి ఆర్థిక ప్రణాళికలు  దెబ్బతింటున్నాయి.

రెరా (RERA) ఇచ్చే రెండు పెద్ద హక్కులు

బిల్డర్ నిర్ణీత సమయానికి ఫ్లాట్ కొనుగోలుదారులకు ఇవ్వకపోతే, వారికి రెండు ప్రధాన ఆప్షన్లు ఉంటాయి. మొదటిది.. అతను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని, తాను కట్టిన పూర్తి మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోరవచ్చు. రెండవది, అతను అదే ప్రాజెక్ట్‌లో కొనసాగుతూ, ఆలస్యమైన కాలానికి వడ్డీని లేదా పరిహారాన్ని డిమాండ్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్, అంటే రెరా (RERA) కొనుగోలుదారులకు చట్టపరమైన హక్కులను కల్పించింది.

Also Read: Retirement Plan: రిటైర్మెంట్ టైంలో రూ.5 కోట్లు కావాలా? SIPని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలంటే

రెరాలో ఎప్పుడు ఫిర్యాదు చేయాలి?

బిల్డర్లు పదేపదే పొడిగించే గడువుల కోసం కొనుగోలుదారులు వేచి చూడకూడదు అని నిపుణులు చెబుతున్నారు. అగ్రిమెంట్‌లో పేర్కొన్న నిర్ణీత తేదీ దాటిపోయి, బిల్డర్ ఎటువంటి నమ్మకమైన కాలపరిమితిని చెప్పనట్లయితే, రెరాలో ఫిర్యాదు చేయవచ్చు. అనేక కేసులలో రెరా కొనుగోలుదారులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ, వడ్డీని లేదా రిఫండ్‌ను చెల్లించాలని బిల్డర్లను ఆదేశించడం తెలిసిందే.

ఈఎంఐ చెల్లించడం ఆపేయవచ్చా?

లేదు. బిల్డర్ మరియు బ్యాంక్‌తో జరిగే ఒప్పందాలు వేర్వేరుగా ఉంటాయి. బిల్డర్ ఫ్లాట్ ఇవ్వకపోయినప్పటికీ, బ్యాంక్‌కు ఈఎంఐని సమయానికి చెల్లించాల్సిందే. ఈఎంఐని నిలిపివేస్తే పెనాల్టీలు పడటం, క్రెడిట్ స్కోర్ దెబ్బతినడం మరియు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

అద్దె, ఈఎంఐ రెండింటి భారం

ఫ్లాట్ చేతికి రావడం ఆలస్యం కావడం వల్ల అతిపెద్ద సమస్య ఒకేసారి అద్దె, ఈఎంఐ రెండింటినీ చెల్లిస్తున్న కుటుంబాలపై పడుతుంది. దీనివల్ల నెలవారీ బడ్జెట్ దెబ్బతింటుంది. పొదుపు తగ్గిపోతుంది, కొన్నిసార్లు ఖర్చులకు నగదు సరిపోదు. కొన్ని సందర్భాల్లో టాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రభావితం కావచ్చు. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. 

ఏ ఏ పత్రాలను మీ వద్ద ఉంచుకోవాలి 

కొనుగోలుదారులు కొన్ని ముఖ్యమైన పత్రాలు మీ వద్ద ఉంచుకుంటే ప్రయోజనం ఉటుంది. అలాట్‌మెంట్ లెటర్, పేమెంట్ రసీదులు, సేల్ అగ్రిమెంట్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, హోమ్ లోన్ రికార్డులు, రెరా రిజిస్ట్రేషన్ వివరాలు, బిల్డర్‌తో జరిపిన ఈమెయిల్ లేదా వాట్సాప్ సంభాషణలను సైతం సేవ్ చేసుకోవడం మంచిది. ఫిర్యాదు లేదా చట్టపరమైన చర్యల సమయంలో ఈ పత్రాలే మీకు బలమైన ఆధారాలుగా మారుతాయి.

Frequently Asked Questions

బిల్డర్ ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే కొనుగోలుదారులకు రెరా ఇచ్చే హక్కులు ఏమిటి?

కొనుగోలుదారులు ప్రాజెక్ట్ నుండి తప్పుకుని, కట్టిన మొత్తాన్ని వడ్డీతో తిరిగి పొందవచ్చు. లేదా ప్రాజెక్ట్‌లోనే కొనసాగుతూ, ఆలస్యమైన కాలానికి వడ్డీ లేదా పరిహారాన్ని కోరవచ్చు.

రెరాలో ఎప్పుడు ఫిర్యాదు చేయాలి?

అగ్రిమెంట్‌లో పేర్కొన్న నిర్ణీత తేదీ దాటిపోయి, బిల్డర్ నమ్మకమైన కాలపరిమితిని చెప్పనట్లయితే రెరాలో ఫిర్యాదు చేయవచ్చు. అనేక కేసులలో రెరా కొనుగోలుదారులకు అనుకూలంగా తీర్పు ఇస్తుంది.

బిల్డర్ ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే ఈఎంఐ చెల్లించడం ఆపేయవచ్చా?

లేదు, బిల్డర్ మరియు బ్యాంక్‌తో ఒప్పందాలు వేర్వేరు. ఈఎంఐని నిలిపివేస్తే పెనాల్టీలు, క్రెడిట్ స్కోర్ దెబ్బతినడం, చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఫ్లాట్ ఆలస్యం అయినప్పుడు ఎలాంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి?

అలాట్‌మెంట్ లెటర్, పేమెంట్ రసీదులు, సేల్ అగ్రిమెంట్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, హోమ్ లోన్ రికార్డులు, రెరా రిజిస్ట్రేషన్ వివరాలు, బిల్డర్‌తో జరిగిన సంభాషణలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవి ఫిర్యాదుకు బలమైన ఆధారాలు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget