అన్వేషించండి

Retirement Plan: రిటైర్మెంట్ టైంలో రూ.5 కోట్లు కావాలా? SIPని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలంటే

Retirement Goal: రిటైర్మెంట్ సమయానికి రూ. 5 కోట్ల కార్పస్‌ను క్రియేట్ చేయడం మీ కల అయితే, మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SIP మొత్తాన్ని పెంచుతూ, వార్షికంగా ప్లాన్‌ను సమీక్షించాలి.

Retirement Goal: చాలా మంది తమ రిటైర్మెంట్ (పదవీ విరమణ) తర్వాత క్యాష్ గురించి ఆందోళన చెందకూడదని కోరుకుంటారు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని చూస్తుంటే కేవలం బ్యాంకులో డబ్బు దాచుకుంటే సరిపోదని అంతా అర్థం చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ సమయానికి మీ వద్ద 5 కోట్ల భారీ నిధి ఉండాలని మీరు అనుకుంటే,పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. దీని కోసం ఒకేసారి లక్షల రూపాయలు అవసరం లేదు. మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) చేయడం ద్వారా కూడా ఈ టార్గెట్ చేరుకోవచ్చు.

5 కోట్ల ఫండ్ ఎందుకు అవసరం?
రిటైర్మెంట్ తర్వాత మీ రెగ్యులర్ శాలరీ ఆగిపోతుంది. కానీ ఖర్చులు మాత్రం అలాగే సాగుతుంటాయి. ఇంటి ఖర్చులు, వైద్యం, జర్నీ, ఇతర అవసరాల కోసం డబ్బు కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో పెద్ద మొత్తంలో ఉండే రిటైర్మెంట్ ఫండ్ మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది.

ఎంత SIP చేయాలి?
ఉదాహరణకు మీ వయస్సు 30 ఏళ్లు అనుకుందాం.. మీరు 60 ఏళ్లకు రిటైర్ అవ్వాలని భావిస్తే.. అంటే పెట్టుబడి పెట్టడానికి మీ వద్ద దాదాపు 30 ఏళ్ల సమయం ఉంది. ఒకవేళ మీకు సగటున ఏడాదికి 12% రిటర్న్ లభిస్తే, ప్రతి నెలా దాదాపు 15,000 నుండి 20,000 వరకు SIP చేయడం ద్వారా 5 కోట్ల రూపాయల వరకు నిధిని సమకూర్చుకోవచ్చు. ఒకవేళ మీ ఏజ్ ఇంకా తక్కువగా ఉంటే, అంతకంటే తక్కువ మొత్తంతోనే ప్రారంభించవచ్చు. ఆలస్యంగా ప్రారంభిస్తే మాత్రం ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ పెట్టాల్సి వస్తుంది.

Also Read: LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే

5 కోట్ల నిధిని సమకూర్చుకోవడానికి 5 సులువైన మార్గాలు
1. వీలైనంత త్వరగా ప్రారంభించాలి
పెట్టుబడిలో సమయమే అన్నింటికంటే పెద్ద శక్తి (కాంపౌండింగ్ పవర్). 25-30 సంవత్సరాల వయస్సులో ప్రారంభించిన పెట్టుబడి సుదీర్ఘ కాలంలో పెద్ద నిధిగా మారుతుంది.

2. ప్రతి సంవత్సరం SIP పెంచుతూ పోవాలి
మీ జీతం పెరుగుతున్న కొద్దీ, మీ SIP మొత్తాన్ని కూడా స్టెప్ అప్ తరహాలో పెంచాలి. ప్రతి సంవత్సరం కొద్దికొద్దిగా పెట్టుబడిని పెంచడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు.

3. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలి
మధ్యమధ్యలో డబ్బులు వెనక్కి తీసుకోవడం వల్ల పెద్ద నిధి సమకూరడానికి ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల రిటైర్మెంట్ ఇన్వెస్ట్‌మెంట్‌ను దీర్ఘకాలం పాటు కొనసాగించాలి. 

4. మార్కెట్ పడిపోయినప్పుడు కంగారు పడకండి
భారత్‌తోొ పాటు అన్ని దేశాల్లోనూ షేర్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు సహజం. అలాంటప్పుడు SIPలను ఆపడానికి బదులు పెట్టుబడిని అలాగే కొనసాగించాలి.

5. ఏడాదికి ఒకసారి ప్లాన్‌ చెక్ చేసుకోండి
ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిని, మీ లక్ష్యాన్ని సమీక్షించుకోవాలి. అవసరమైతే SIP మొత్తాన్ని మరింత పెంచుకోవచ్చు.

Also Read: Affordable 7 Seater Cars: 10 లక్షల రూపాయల్లో బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే.. ఫ్యామిలీ జర్నీకి తిరుగులేదు

చిన్న SIP కూడా పెద్ద ఫండ్ క్రియేట్ చేస్తుంది 
కోటీశ్వరులు కావాలంటే ఒకటేసారి చాలా ఎక్కువ డబ్బు కావాలని చాలా మంది భావిస్తారు. కానీ నిజం ఏంటంటే, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి, సమయం ఒక చిన్న SIP కూడా కోట్ల రూపాయల నిధిగా మార్చగలదు. 

Frequently Asked Questions

5 కోట్ల నిధిని చేరుకోవడానికి ముఖ్యమైన మార్గాలు ఏమిటి?

వీలైనంత త్వరగా పెట్టుబడి ప్రారంభించడం, ప్రతి సంవత్సరం SIP మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం, దీర్ఘకాలం పాటు పెట్టుబడిని కొనసాగించడం, మార్కెట్ హెచ్చుతగ్గులకు కంగారు పడకపోవడం ముఖ్యం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget