అన్వేషించండి

LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే

భారత్‌లో గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు పెంచాయి. గత 3 నెలల వ్యవధిలో గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండవసారి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జూన్ 7 నుండి దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.29 పెంపు.
  • జూన్ 1 నుండి వాణిజ్య సిలిండర్ ధర రూ.42 పెంపు.
  • పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు పెంపునకు కారణం.

న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం భారత్ సహా పలు దేశాల్లో సెగలు రేపుతోంది. ఈ క్రమంలో భారత్‌లో మధ్యతరగతి, సామాన్య ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (Domestic LPG Cylinder) ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. కమర్షియల్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల వరుస పెరుగుదలతో సామాన్యుల వంటగది బడ్జెట్‌పై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 913 నుంచి 942కు చేరుకుంది. జూన్ 7 నుంచి ఈ ధర అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో 14 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965 నుంచి రూ.994 అయింది. 

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు, వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల (19 KG) ధరలు కూడా గత నాలుగు నెలలుగా నిరంతరం పెరుగుతున్నాయి. వ్యాపార రంగంపై ప్రభావం చూపిన గత నాలుగు నెలల కమర్షియల్ సిలిండర్ ధరల హెచ్చుతగ్గుల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరిలో రూ.111 చొప్పున పెంచారు.

Also Read: June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!

ఫిబ్రవరి 2026: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.49 పెంచారు. 

మార్చి 2026: ఆర్థిక సంవత్సరం ముగింపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.144 మేర పెంచారు.

ఏప్రిల్ 2026: హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులకు షాక్ ఇస్తూ చమురు సంస్థలు కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా రూ.194 మేర పెంచాయి.

మే 2026: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరల ఒత్తిడి పెరిగి, ఈ నెలలో కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.9993 మేర అదనపు భారాన్ని మోపారు.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు
కొత్త నెల ప్రారంభంలోనే వినియోగదారులపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అదనపు భారాన్ని మోపాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 1 నుండి ఈ పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈసారి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరపై దేశవ్యాప్తంగా సగటున రూ. 42 మేర పెంపును వర్తింపజేశారు. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలలో ఈ నెల ప్రారంభంలో ఎలాంటి మార్పులు చేయలేదు. 

పశ్చిమ ఆసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలతో పాటు ఎల్‌పీజీ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌కు జరుగుతున్న ఇంధన దిగుమతుల ఖర్చులు భారీగా పెరగడంతో, దేశీయ గ్యాస్ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి ఈ ధరల పెంపునకు దారితీసింది. ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశంలోని వివిధ ప్రధాన నగరాలపై విభిన్నంగా పడింది.

Also Read: సరైన ITR ఫారమ్‌ ఎలా ఎంచుకోవాలి.. ఇంటి నుంచే మీ రిటర్న్స్ ఇలా ఫైల్ చేయండి

 వివిధ నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల రిటైల్ ధరల వివరాలు:

హైదరాబాద్: ఇక్కడ కమర్షియల్ సిలిండర్ ధర అత్యధికంగా రూ. 52 మేర పెరగడంతో, ప్రస్తుతం దీని రిటైల్ ధర రూ. 3,367 కి చేరుకుంది.

ఢిల్లీ: దేశ రాజధానిలో సిలిండర్ ధర రూ. 42 పెరగడంతో, అక్కడ దీని ధర రూ. 3,113.50 గా నమోదైంది.

కోల్‌కతా: ఇక్కడ రూ. 53.50 మేర పెరిగిన ధరతో కమర్షియల్ సిలిండర్ రిటైల్ ధర రూ. 3,255.50 కి చేరింది.

Frequently Asked Questions

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది?

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.29 మేర పెరిగింది. కేవలం మూడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి పెరగడం.

హైదరాబాద్‌లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ కొత్త ధర ఎంత?

హైదరాబాద్‌లో 14 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 965 నుంచి రూ.994 అయింది. ఈ ధర జూన్ 7 నుండి అమల్లోకి వస్తుంది.

గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి?

ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రధాన కారణం. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఈ భారం పడింది.

కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ఎంత పెరిగాయి మరియు హైదరాబాద్‌లో దాని ధర ఎంత?

జూన్ 1 నుండి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు సగటున రూ. 42 మేర పెరిగాయి. హైదరాబాద్‌లో రూ. 52 మేర పెరిగి దాని రిటైల్ ధర రూ. 3,367 కి చేరింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget