అన్వేషించండి

Income Tax Return Filing: సరైన ITR ఫారమ్‌ ఎలా ఎంచుకోవాలి.. ఇంటి నుంచే మీ రిటర్న్స్ ఇలా ఫైల్ చేయండి

ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. మీ ITRను మీ ఇంటి నుండే దాఖలు చేయాలనుకుంటే, ఎలా చేయాలో ప్రక్రియ ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి సరైన ఫారం ఎంచుకోవడం ముఖ్యం.
  • జీతం, వడ్డీ, ఇంటి అద్దె ఆదాయాలకు ITR-1, వ్యాపారాలకు ITR-3, ITR-4 వాడాలి.
  • ఆదాయపు పన్ను అధికారిక వెబ్సైట్లో పాన్, ఆధార్, ఫారం 16తో ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు.
  • రిటర్న్ దాఖలు తర్వాత ఆధార్ OTPతో ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి, రీఫండ్ పొందడానికి.

ITR Filing: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేసే సీజన్ మొదలైంది. ప్రతి ఏడాది లక్షలాది మంది లాస్ట్ డేట్ సమయంలో తొందరపాటుగా రిటర్న్స్ దాఖలు చేస్తారు. చాలా సార్లు తప్పు ITR ఫారమ్ సెలక్ట్ చేసుకుంటారు. దీని వల్ల తర్వాత నోటీసు రావడం, రీఫండ్ నిలిచిపోవడం లేదా మళ్లీ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కూడా మొదటిసారి ITR ఫైల్ చేస్తున్నారా.. లేదా ప్రతిసారీ ఎవరైనా సిఏ (CA) సహాయం తీసుకుంటుంటే ఈ వార్త చదవండి.  ఏ ITR ఫారమ్ ఎవరి కోసం, ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో రిటర్న్ ఎలా ఫైల్ చేయాలో అర్థం చేసుకోండి. దీని ద్వారా మీరు ఎవరికీ ఫీజు చెల్లించకుండా, మీ అంతట మీరే ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. 

ITR అంటే ఏమిటి?
ITR అంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (Income Tax Return). మీరు ఓ ఆర్థిక సంవత్సరంలో ఎంత సంపాదించారు. ఎంత పన్ను చెల్లించారు అని ప్రభుత్వానికి తెలియజేసే ఒక ఫారమ్. ఒకవేళ ఎక్కువ ట్యాక్స్ కట్ అయి ఉంటే, రీఫండ్ కూడా లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, అద్దె, షేర్ మార్కెట్ లేదా ఫ్రీలాన్సింగ్ వంటి వాటి ద్వారా సంపాదించే వారికి ITR ఫైలింగ్ అవసరం. 

మీకు ఏ ITR ఫారమ్ సరైనది?
తప్పుడు ఫారమ్‌ను సెలక్ట్ చేయడం అన్నిటికంటే పెద్ద తప్పు. అందువల్ల మొదట మీ ఆదాయం ఏ కేటగిరీలోకి వస్తుందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఐటీఆర్ కి సంబంధించిన 4 ఫారమ్‌లను చూడండి.

ITR-1: ఇది అత్యంత ఈజీ ఫారమ్. మీ ఆదాయం కేవలం జీతం, ఒక ఇంటి ప్రాపర్టీ, వడ్డీ ద్వారా వస్తూ, వార్షిక ఆదాయం 50 లక్షల వరకు ఉంటే, సాధారణంగా ITR-1 ఫైల్ చేయాలి.

ITR-2: మీ ఆదాయం 50 లక్షల కంటే ఎక్కువగా ఉండి, ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు ఉన్నా లేదా షేర్ మార్కెట్/ క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఆదాయం వచ్చినా ఈ ఫారమ్ ఉపయోగించాలి. 

ITR-3: వ్యాపారం చేసేవారు, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్లు లేదా ట్రేడింగ్ ద్వారా సంపాదించే వారు ఈ ఫారమ్ నింపాలి. 

ITR-4: ఇది చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు లేదా ప్రిజంప్టివ్ ఇన్‌కమ్ స్కీమ్ (presumptive income scheme) ఉన్న ట్యాక్స్ పేయర్ల కోసం ఈ ఫారమ్ ఉంటుంది.

Also Read: Good News For Gautam Adani: అమెరికాలో గౌతమ్ అదానీపై ఉన్న కేసులన్నీ విత్‌డ్రా చేసుకున్న న్యాయ శాఖ

ఇంటి నుంచే ITR ఎలా ఫైల్ చేయాలి?
ఇప్పుడు ITR ఫైల్ చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అక్కర్లేదు. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో కూర్చొని చేయవచ్చు.

ఇన్‌కమ్ టాక్స్ అధికారిక వెబ్‌సైట్ అంటే పోర్టల్ (https://www.incometax.gov.in/iec/foportal/) లో లాగిన్ అవ్వండి.

అవసరమైన డాక్యుమెంట్లు ఇవే.. 

పాన్ కార్డ్

ఆధార్ కార్డ్

ఫారమ్ 16 (Form 16)

బ్యాంక్ వివరాలు

AIS/TIS సమాచారం

ఇన్వెస్టిమెంట్, టాక్స్ సేవింగ్ ప్రూఫ్స్

సరైన సంవత్సరాన్ని ఎంచుకోండి: ఏ ఆర్థిక సంవత్సరం (FY) ఆదాయానికి రిటర్న్ ఫైల్ చేస్తున్నారో, దానికి అనుగుణంగా సరైన అస్సెస్మెంట్ ఇయర్ (AY) ఎంచుకోవాలి. 

సరైన ITR ఫారమ్‌: ఇప్పుడు మీ ఆదాయాన్ని బట్టి సరైన ITR ఫారమ్‌ ఎంచుకోండి. పోర్టల్‌లో పలు చోట్ల హెల్ప్ ఆప్షన్ కూడా ఇస్తారు. 

వివరాలను నింపండి: మీ జీతం, బ్యాంక్ వడ్డీ, పెట్టుబడులు, ట్యాక్స్ వివరాలను నింపండి. అన్నింటినీ ఖచ్చితంగా చెక్ చేయండి (వెరిఫై చేయండి).

Also Read: Royal Enfield In Andhra Pradesh: తిరుపతి జిల్లాలో బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టు పూర్తి: ఏపీ సీఎం చంద్రబాబు

ఈ-వెరిఫికేషన్ (e-Verification): రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్ లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఈ-వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ చేయకపోతే ITR అసంపూర్ణంగా ఉందని భావిస్తారు. 

ITR ఫైల్ చేయడానికి ముందు మీ వద్ద ఈ 6 డాక్యుమెంట్స్ ఉండాలి, లేకపోతే మీ మనీ రీఫండ్ ఆగిపోతుంది. 

ITR ఫైల్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు

తప్పుడు ITR ఫారమ్‌ ఎంచుకోవడం

AIS/TIS డేటా మ్యాచ్ అవ్వకపోవడం

బ్యాంక్ అకౌంట్ అప్‌డేట్ చేయకపోవడం

చివరి తేదీ వరకు వెయిట్ చేయడం 

ఈ-వెరిఫికేషన్ చేయడం మర్చిపోవడం

త్వరగా ఫైల్ చేయడం ప్రయోజనం ఏమిటి?
ఐటీఆర్ త్వరగా ఫైల్ చేయడం వల్ల రీఫండ్ త్వరగా వస్తుంది. అలాగే చివరి నిమిషంలో వెబ్‌సైట్ స్లో అవ్వడం లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్  నుండి తప్పించుకోవచ్చు. ఇది కాకుండా హోమ్ లోన్, వీసా, అనేక పనులలో ITR ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌గా భావిస్తారు. అందువల్ల సమయం ఉండగానే సరైన పద్ధతిలో రిటర్న్ ఫైల్ చేసుకోండి. 

Frequently Asked Questions

ITR అంటే ఏమిటి?

ITR అంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు సంపాదించిన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేసే ఫారమ్ ఇది. ఎక్కువ పన్ను కట్టి ఉంటే రీఫండ్ కూడా పొందవచ్చు.

నాకు ఏ ITR ఫారమ్ సరైనది?

మీ ఆదాయ వనరులు, వార్షిక ఆదాయాన్ని బట్టి సరైన ITR ఫారమ్ ఎంచుకోవాలి. జీతం, ఒక ఇంటి అద్దె, వడ్డీ ఆదాయం 50 లక్షల లోపు ఉంటే ITR-1. అంతకంటే ఎక్కువ ఆదాయం, ఒకటి కంటే ఎక్కువ ఆస్తులు, షేర్ మార్కెట్ ఆదాయం ఉంటే ITR-2 ఉపయోగించాలి.

వ్యాపారం చేసేవారు ఏ ITR ఫారమ్ వాడాలి?

వ్యాపారం చేసేవారు, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్లు లేదా ట్రేడింగ్ ద్వారా సంపాదించేవారు ITR-3 ఫారమ్ నింపాలి. చిన్న వ్యాపారస్తులు, ప్రిజంప్టివ్ ఇన్‌కమ్ స్కీమ్ ఉన్నవారు ITR-4 ఫారమ్ వాడాలి.

ఇంటి నుంచే ITR ఫైల్ చేయడానికి ఏమేమి కావాలి?

ఇంటి నుంచే ITR ఫైల్ చేయడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫారమ్ 16, బ్యాంక్ వివరాలు, AIS/TIS సమాచారం, ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ అవసరం. సరైన ఆర్థిక సంవత్సరం, ITR ఫారమ్ ఎంచుకుని వివరాలు నింపాలి.

ITR ఫైల్ చేశాక ఏం చేయాలి?

ITR ఫైల్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ చేయాలి. ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ అకౌంట్ ద్వారా దీన్ని చేయవచ్చు. వెరిఫికేషన్ చేయకపోతే మీ ITR అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget