అన్వేషించండి

Good News For Gautam Adani: అమెరికాలో గౌతమ్ అదానీపై ఉన్న కేసులన్నీ విత్‌డ్రా చేసుకున్న న్యాయ శాఖ

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani ), మేనల్లుడు సాగర్ అదానీపై అమెరికా న్యాయ శాఖ క్రిమినల్ ఆరోపణలు ఉపసంహరించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా న్యాయ విభాగం అదానీ, మేనల్లుడిపై క్రిమినల్ ఆరోపణలు ఉపసంహరించింది.
  • న్యూయార్క్‌లో సెక్యూరిటీస్, మోసం కేసు పూర్తిగా ముగింపు పలికింది.
  • అమెరికాలో అదానీ గ్రూప్‌కు సంబంధించిన అన్ని కేసులు మూసివేయబడ్డాయి.
  • ఆరోపణలను కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూషన్ పేర్కొంది.

వాషింగ్టన్: అమెరికా న్యాయ విభాగం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న క్రిమినల్ కేసులన్నింటినీ శాశ్వతంగా ఉపసంహరించుకుంది. దీనితో న్యూయార్క్‌లో జరుగుతున్న వివాదాస్పద సెక్యూరిటీస్ అండ్ చీటింగ్ కేసు పూర్తిగా ముగిసింది. తమ వద్ద అందుకు తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు చెప్పిన తరువాత ఈ నిర్ణయం వెలువడింది. అదానీపై  ఆరోపణలను ఇకపై కొనసాగించలేమని అమెరికా ప్రాసిక్యూటర్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో స్పష్టం చేశారు. 

గత కొన్ని రోజులుగా అమెరికాలో అదానీ గ్రూప్‌నకు సంబంధించిన అన్ని కేసులు విత్ డ్రా చేసుకున్నట్లు అయింది. ఈ కేసును సమీక్షించిన తర్వాత, తమ 'ప్రాసిక్యూషన్ విచక్షణ' ప్రకారం, ఈ క్రిమినల్ ఆరోపణలపై ఇకపై వనరులను వినియోగించరాదని నిర్ణయించుకున్నామని అమెరికా ప్రాసిక్యూటర్లు ఈస్ట్ న్యూయార్క్ కోర్టులో తెలిపారు. గత వారం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ అదానీ, అదానీ గ్రూపుపై సివిల్ కేసులు విత్‌డ్రా చేసుకోవడం తెలిసిందే. 

గౌతమ్ అదానీపై ఆరోపణల ఉపసంహరణ

భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీపై ఆరోపణలను శాశ్వతంగా కొట్టివేయాలని కోర్టు ఆదేశించింది. అంటే ఈ కేసును మళ్లీ ఓపెన్ చేయడానికి ఇక వీలుండదు. గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్‌నకు సంబంధించిన అనేక అమెరికా నియంత్రణ, చట్టపరమైన కేసులు మూసివేసిన సమయంలో అమెరికా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: Royal Enfield In Andhra Pradesh: తిరుపతి జిల్లాలో బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టు పూర్తి: ఏపీ సీఎం చంద్రబాబు

గత వారం యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడిదారుల వెల్లడి కేసును క్లోజ్ చేసింది. ఈ కేసులో ఎటువంటి తప్పును అంగీకరించకుండా లేదా తిరస్కరించకుండా గౌతమ్ అదానీ 60 లక్షల డాలర్లు, సాగర్ అదానీ 120 లక్షల డాలర్లు చెల్లించడానికి అంగీకరించారు.

అనంతరం అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) కూడా ఇరాన్‌కు సంబంధించిన ఆంక్షల ఉల్లంఘన కేసులో అదానీ గ్రూప్‌తో 27.5 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది. ఇరాన్ LPG దిగుమతి కేసులో విస్తృత సహకారం, స్వచ్ఛంద వెల్లడి ఆధారంగా ఈ ఒప్పందం కుదిరింది. తాజాగా అమెరికా న్యాయ విభాగం కూడా అదానీ, ఆయన మేనల్లుడిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తొలగించింది. దాంతో హైప్రొఫైల్ సెక్యూరిటీ, వైర్ ఫ్రాడ్ కేసు అధికారికంగా ముగిసింది.

అమెరికా కోర్టులో దాఖలు చేసిన పత్రాల ప్రకారం, సమీక్షించిన తర్వాత అదానీపై ఆరోపణలను కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రాసిక్యూషన్ పేర్కొంది. అమెరికా కోర్టు కేసును కొట్టివేస్తూ శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించింది. అయితే, అమెరికా క్రిమినల్ విధానాలలో ఇలాంటి నిర్ణయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సాధారణంగా విస్తృత సమీక్ష తర్వాత మాత్రమే ఇలాంటి తీర్పు వస్తుంది. 

నివేదికల ప్రకారం, దర్యాప్తు సమయంలో ఆరోపణలను కొనసాగించడానికి తగినన్ని ఆధారాలు ప్రాసిక్యూటర్లకు లభించలేదు. ఈ కేసు 2024 ఏడాది చివరి రోజుల్లో దాఖలైంది. అదానీ గ్రూప్ భారత అధికారులకు సంబంధించిన 26.5 కోట్ల డాలర్ల లంచం కేసును దాచిపెట్టి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడి సేకరించిందనేది ప్రధాన ఆరోపణ.

 కేసులను ముగించిన అమెరికా న్యాయ విభాగం

అమెరికా ప్రాసిక్యూటర్లు, అదానీ గ్రూప్ ఏర్పాటు చేసిన లాయర్ల టీమ్ మధ్య నెలల తరబడి జరిగిన చర్చల తర్వాత కేసులు విత్‌డ్రా చేసుకున్నారు. న్యాయ సలహాదారులు అమెరికా అధికారుల ముందు పలు విషయాలను సమర్పించారు. ఈ సమీక్షలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై ఆరోపణలను కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని తేలింది. దాంతో అమెరికా న్యాయ విభాగం కేసును ముగించే ప్రయత్నం చేసింది. 

ఏప్రిల్ 7, 2026న అమెరికా కోర్టులో దాఖలు చేసిన పత్రాలలో, అదానీ లాయర్లు SEC చర్యలను సవాలు చేస్తూ, వారికి అవసరమైన అధికార పరిధి లేదని, ఎలాంటి స్పష్టమైన తప్పుడు ప్రకటనలను నిరూపించలేదని,చ ఏ ప్రతివాదిని బాండ్ల జారీకి అనుసంధానం చేయలేదని కోర్టులో పేర్కొన్నారు.

గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీస్ అండ్ వైర్ మోసానికి సంబంధించిన నిబంధనల ప్రకారం మాత్రమే ఆరోపణలు వచ్చాయి. అయితే మరింత తీవ్రమైన విదేశీ అవినీతి నిరోధక చట్టం (FCPA) కింద లంచం, ఇతర ఆరోపణలలో చేర్చలేదు.

Frequently Asked Questions

అమెరికా న్యాయ విభాగం అదానీ గ్రూప్‌పై క్రిమినల్ ఆరోపణలను ఎందుకు ఉపసంహరించుకుంది?

ఆరోపణలను కొనసాగించడానికి తగినంత ఆధారాలు లేవని అమెరికా ప్రాసిక్యూటర్లు నిర్ణయించినందున క్రిమినల్ ఆరోపణలను శాశ్వతంగా ఉపసంహరించుకున్నారు.

గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై ఏ కేసు పూర్తిగా ముగిసింది?

గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై న్యూయార్క్‌లో ఉన్న వివాదాస్పద సెక్యూరిటీస్ మరియు మోసం కేసు అమెరికా న్యాయ విభాగం ఆరోపణలను ఉపసంహరించుకోవడంతో పూర్తిగా ముగిసింది.

SEC కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ ఎంత చెల్లించారు?

గౌతమ్ అదానీ 60 లక్షల డాలర్లు, సాగర్ అదానీ 120 లక్షల డాలర్లు ఎటువంటి తప్పును అంగీకరించకుండా లేదా తిరస్కరించకుండా చెల్లించడానికి అంగీకరించారు.

OFAC ఇరాన్‌కు సంబంధించిన కేసులో అదానీ గ్రూప్‌తో ఎంత ఒప్పందం చేసుకుంది?

ఇరాన్ LPG దిగుమతి కేసులో, OFAC అదానీ గ్రూప్‌తో 27.5 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget