అన్వేషించండి

Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ

Indian Rupee Hits Record Low Against US Dollar: డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మరింత పతనం అయింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల రూపాయి 96.17 కనిష్ట స్థాయికి చేరింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కనిష్టానికి చేరింది.
  • అధిక ముడి చమురు దిగుమతి వ్యయాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి.
  • ట్రంప్ హెచ్చరికలతో విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఒత్తిడిని పెంచింది.
  • రూపాయి బలహీనపడటంతో దిగుమతులు, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి.

Indian Rupee vs Dollar: భారత కరెన్సీ విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది. సోమవారం నాడు  వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కనిష్ట స్థాయికి పడిపోయింది. మే 18న భారత రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 96.17 వద్ద చారిత్రాత్మక కనిష్ట స్థాయికి (Indian Rupee All Time Low) పడిపోయింది.

ట్రేడింగ్ సమయంలో కొంత సమయం పాటు ఒక డాలర్‌కు భారత రూపాయి 96.18  పడిపోయింది. ఇది మునుపటి క్లోజింగ్ ధర కంటే దాదాపు 0.2 శాతం కంటే తక్కువ. ఈ క్షీణతతో గత రికార్డు కనిష్ట స్థాయి ధర 96.1350ని కూడా నేటి ట్రేడింగ్‌లో దాటింది.

రూపాయి పతనానికి  ముడి చమురుకు లింకేంటి ?‌

భారత్ తన అవసరాలలో దాదాపు 85 శాతం ముడి చమురును ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుందని తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 111 డాలర్లకు చేరడంతో భారత దిగుమతి వ్యయం భారీగా పెరుగుతుంది. దాంతో భారత చమురు దిగుమతిదారులు చెల్లింపులు చేయడానికి మరిన్ని డాలర్లు అవసరం అవుతాయి. మార్కెట్‌లో డాలర్లను కొనుగోలు చేయడానికి డిమాండ్ పెరిగినప్పుడు, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. 

Also Read: Political Publicity: ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !

డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్చరిక కారణం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో ఇలా పోస్ట్ చేశారు. 'ఇరాన్ కోసం అమెరికా ఎదురుచూస్తోంది. పరిస్థితి మరింత దిగజారకూడదంటే ఇరాన్ వేగంగా చర్యలు తీసుకోవాలి. చర్చల ద్వారా ఒప్పందం చేసుకుంటే వారికే మంచిది. లేకపోతే ప్రపంచ పటంలో వారి జాడ లేకుండా చేస్తాం. సమయం చాలా తక్కువగా ఉందని, ఇరాన్ త్వరగా మేల్కోవాలని’ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ట్రంప్ తాజా వార్నింగ్ ప్రకటన కారణంగా ప్రపంచ పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దాంతో భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకుని సేఫ్ అని భావించే అమెరికన్ డాలర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంగా భారత రూపాయిపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. 

సామాన్యులపై ప్రభావం ఏమిటి? 

భారత కరెన్సీ రూపాయి బలహీనపడితే, విదేశాలలో విద్య నుంచి వైద్య చికిత్స వరకు ఎన్నో విషయాలు మరింత ఖరీదు అవుతాయి. టిక్కెట్లు లేదా ట్యూషన్ ఫీజులు చెల్లించడానికి ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.

రూపాయి బలహీనపడితే, భారత్‌లోకి దిగుమతి చేసుకునే మొబైల్, ఆటోమొబైల్ భాగాలు, ల్యాప్‌టాప్‌లు, ల్యాప్‌టాప్ భాగాలు మరింత ఖరీదు అవుతాయి. 

డాలర్ మరింత ఖరీదు అయితే దేశంలో రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల నిత్యావసర వస్తువులతో పాటు పలు ఉత్పత్తుల ధర క్రమంగా పెరుగుతుంది.

Also Read: Currency Notes Shower: ఆ సింగర్‌ పాటలకు తట్టుకోలేక ముంచేశారు .. కరెన్సీ నోట్లతో - ఈ వీడియోలు చూస్తే ఆశ్చర్యపోతారు!

Frequently Asked Questions

అమెరికన్ డాలర్ తో పోలిస్తే భారత రూపాయి కనిష్ట స్థాయికి ఎందుకు పడిపోయింది?

ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో పెరగడం, డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై చేసిన హెచ్చరికల కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి కారణాలు.

ముడి చమురు ధరలు పెరగడం భారత రూపాయిని ఎలా ప్రభావితం చేస్తుంది?

భారత్ తన అవసరాలలో 85% ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దిగుమతి వ్యయం పెరిగి, చెల్లింపులకు మరిన్ని డాలర్లు అవసరం అవుతాయి. డాలర్ల కొనుగోలుకు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ తగ్గుతుంది.

డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు రూపాయి విలువపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి?

ట్రంప్ హెచ్చరికల కారణంగా ప్రపంచ పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించి, అమెరికన్ డాలర్లలో పెట్టుబడి పెడుతున్నారు, ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతుంది.

రూపాయి బలహీనపడితే సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

విదేశాలలో విద్య, వైద్యం ఖరీదు అవుతాయి. దిగుమతి చేసుకునే మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ఆటోమొబైల్ విడిభాగాలు వంటివి ఖరీదవుతాయి. రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
మోడీ vs నెహ్రూ ! దేశానికి సుదీర్ఘ ప్రధాని ఎవరు ??, Modi or Nehru, Who is longest serving PM??
మోడీ vs నెహ్రూ ! దేశానికి సుదీర్ఘ ప్రధాని ఎవరు ??, అసలు లెక్కలు ఏం చెప్తున్నాయి!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Embed widget